అల్లాడించాలనే చరణ్ ఆమెపై కన్నేశాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో వంశీ పైడి పల్లి దర్శకత్వంలో 'ఎవడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంతతో పాటు బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. అమీ జాక్సన్ ఎంపికపై ఫిల్మ్ నగర్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 'ఎవడు' చిత్రం ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా మోడ్రన్‌గా తెరకెక్కించాలని నిర్ణయించారని, బికినీ భామలు, లిప్ లాక్ సీన్లు ఈ సినిమాలో ప్లాన్ చేశారని అంటున్నారు.
తన అద్భుతమైన యాక్టింగ్ తో పాటు హాట్ హాట్ అందాలతో అభిమానులను అల్లాడించే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ స్వయంగా అమీజాక్సన్ ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. సినిమాలో అమీపై బికికీ సీన్లు, లిప్ లాక్ సన్ని వేశాలు తప్పనిసరిగా ఉంటాయనే వాదన తెరపైకి వచ్చింది.
అమీ జాక్సన్‌కు న్యూడ్ గా నటించడం, బికినీలు వేయడం, మత్తెక్కించే రేంజ్ లో లిప్ లాక్ సీన్లలో నటించడం చాక్లెట్ తిన్నంత వీజీ. ఇతర హీరోయిన్లు అయితే ఇలాంటి విషయాల్లో కాస్త ఇబ్బంది ఉంటుంది కాబట్టే....ఇలాంటి విషయాల్లో బాగా అనుభవం ఉన్న ఈవిడను ఎంపిక చేశారు. మరి మెగా అభిమానులను అమీ హాట్ పెర్ఫార్మెన్స్ ఏమేరకు ఆకట్టుకుంటుందో అనే చర్చ పరిశ్రమలో జోరుగా సాగుతోంది.
రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా చేస్తున్నారు. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











