అనుష్కా వదల బొమ్మాళీ...నిన్నొదలా అంటున్న ఐటీ
టాలీవుడ్ సూపర్ హీరోయిన్ అనుష్క పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆమె ఆస్తులపై ఆదాయపన్ను శాఖ కన్ను పడటమే ఇందుక్కారణం. అనుష్క రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిందన్న విషయంపై ఐటీ లోతుగా పరిశీలన జరుపుతోంది. ఆమధ్య నాగార్జున, రవితేజ, అనుష్క ఇళ్లపై ఐటీ శాఖ ఒకేసారి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వారి సంగతి ఎలా ఉన్నా అనుష్క మాత్రం ఐటీ దాడులతో బెంబేలెత్తిపోతోంది. ఇదిలావుండగా అనుష్క హోమ్ టౌన్ బెంగళూరులోనూ ఆమెకేమైనా అక్రమ సంపాదన ఉన్నదా అన్న కోణంలో ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు టాలీవుడ్ ఫిలిమ్ జనం అనుకుంటున్నారు. ఈ విషయం అనుష్క చెవిన పడటంతో ఉన్నఫళంగా అమ్మడు తట్టాబుట్టా సర్దుకుని బెంగళూరుకు చెక్కేసిందట. ఎవరైనా ఫోన్ చేస్తే కొంతకాలం ఆగిన తర్వాత మళ్లీ కలుస్తానని సమాధానామిస్తోందట. పరిస్థితి అంతా సద్దుమణిగాక తిరిగి హైదరాబాదులో కాలుపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నదట.
నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఒకటి 'రాజన్న' కాగా, మరొకటి 'ఢమరుకం'. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఈ 'ఢమరుకం'.సినిమా సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 25 నుంచి యూరప్ లో జరుగుతుంది. అక్కడి అందమైన పలు లోకేషన్లలో నాగార్జున, అనుష్కలపై ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరైతే అనుష్క, నాగార్జున, గాసిప్స్, రూమర్స్ దూరం పెట్టి యూరప్ లో చెట్టాపట్టాలేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











