AP Elections 2024: ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు.. పవన్ కల్యాణ్‌పై వేణుస్వామి జోస్యం ఫలిస్తుందా?
తెలుగు రాష్ట్రాల్లో జోస్యాలు చెప్పి పాపులర్ అయిన వారిలో ప్రముఖంగా వేణుస్వామి పేరు వినిపిస్తుంది. సినీ తారల జీవితాలు, సంసారాలు, వైవాహిక జీవితాలు పెటాకులు లాంటి విషయాలపై తనదైన రితీలో జాతకాలు చెప్పి పాపులర్ అయ్యారు. అయితే రాజకీయాల విషయానికి వస్తే.. ఆయన జాతకాలు అటు ఇటుగా తప్పుదారి పట్టాయి. అయితే ఏపీ ఎన్నికల్లో గతంలో ఆయన చెప్పిన జాతకం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకు ఆ వీడియోలో వేణుస్వామి చెప్పినదేమిటంటే?
2024 ఎన్నికల గురించి ఏపీలో రాజకీయ పార్టీల పనితీరు. ప్రజాబలం, ఆయా పార్టీల జాతకాలను అనుసరించి జోస్యం చెప్పారు. నేను ప్రజల నాడిని చూసి చెప్పను. ఆయా వ్యక్తుల జాతకాలను బట్టే నా విశ్లేషణ ఉంటుందని అన్నారు. రాజకీయ, సామాజిక పరిస్థితలను బేరిజు వేసి చెబితే అది జోస్యం అవుతుంది. కానీ నేను జాతకాలు చెప్పే వ్యక్తిని అంటూ వేణు స్వామి అన్నారు.

వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నేతల జాతకాలు నా వద్ద ఉన్నాయి. అయితే ఆయన జాతకం ప్రకారం వైఎస్ జగన్‌కు తిరుగు ఉండదు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు. కానీ ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి తన జాతకాన్ని విప్పారు.
అయితే ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో అభిప్రాయలు విభిన్నంగా కనిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీ గెలుస్తుందో గట్టిగా చెప్పలేకపోయినా.. అత్తెసరు మెజారిటీతో వైసీపీ గానీ, తెలుగుదేశం గానీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తున్నది. అయితే ఇదే నిజమైతే.. ఏ పార్టీ కూడా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నుంచి కనుమరుగు అయ్యే పరిస్థితి ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఒకవేళ ఆయన ఊహించినట్టు వైఎస్ జగన్ విజయం సాధించలేకపోయినా.. ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించినా.. ఏ పార్టీ కూడా కనుమరుగు కాదనేది రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ విషయంలో వేణుస్వామి లెక్క తప్పుతుందా? అనేది మెజారిటీ వర్గాల వాదన.
అయితే వేణుస్వామి గతంలో చెప్పిన జాతకాన్ని బయటకు లాగి.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీ బలహీన పడటం, వైఎస్ జగన్ హవా, వేవ్ అలాగే కొనసాగుతుందని ఆయన ఊహించి ఉంటారు. మళ్లీ జగన్ వస్తే.. టీడీపీ, జనసేన పార్టీలలో ఏదో ఓకటి కనుమరుగు అయిపోతుందని భావించి ఉంటారు. కానీ వైఎస్ జగన్ ఓడిపోతే పరిస్థితి ఏమిటనే విషయంపై ఆయనను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











