వారిపై నిషేధం...నెక్ట్స్ బాలయ్యేనా? (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ఎన్నికల వేళ పలువురు సినీ తారలు కూడా...తాము సైతం ప్రజా సేవకు అంటూ పలు నియోజకవర్గాల నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నసినిమా తారలు నటించిన సినిమాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్‌లో ప్రసారం చేయకుండా లక్నోలోని ఎన్నికల సంఘం నిషేధం విధించడం చర్చనీయాంశం అయింది.

బాలీవుడ్ హీరోయిన్లు హేమా మాలిని, జయప్రద, నగ్మ, స్మృతి ఇరానీ, రాజ్ బబ్బర్, జావెద్ జాఫ్రీ నటించిన సినిమాలపై నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరో బాలయ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన సినిమాలపై కూడా నిషేదం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బాలయ్య నటించిన 'లెజెండ్' చిత్రాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేయాలంటూ ఇప్పటికే అనంతపురం జిల్లా కలెకలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేసారు. ఆయన హిందూపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రభావం ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఈ ఫిర్యాదు చేసారు.

బాలయ్య ‘లెజెండ్'

బాలయ్య ‘లెజెండ్'

నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిన్న ఆయన ‘హిందూ పురం' అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసారు. ఆయన నటించిన లెజెండ్ చిత్రం ఇటీవల విడుదలైనంది. ఈచిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించరు.

నగ్మా

నగ్మా

ఒకప్పుడు సౌతిండియా హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన నగ్మా...ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

జయప్రద

జయప్రద

నటి ప్రయపద రాష్ట్రీయ లోక్ దల్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

హేమా మాలిని

హేమా మాలిని

ప్రముఖ బాలీవుడ్ నటి హేమా మాలిని భారతీయ జనతా పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

జావేద్ జాఫ్రి

జావేద్ జాఫ్రి

బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రి ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X