చిరంజీవిని వెంటాడుతున్న ఫెయిల్యూర్ సెంటిమెంట్.. విశ్వంభర హిట్ అయ్యేనా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. తన కెరీర్ ఆరంభం నుంచి 150 సినిమాల్లో తనదైన శైలిలో ఫెర్ఫార్మ్ చేసి మెగాస్టార్‌గా ఎవరికీ అందని టాప్ స్థానంలో కూర్చొన్నాడు. అయితే తాజాగా విశ్వంభర అనే క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు, మెగాస్టార్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్ విషయానికి వస్తే..
విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. అందాల నటి త్రిషా కృష్ణన్ హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరీ, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభీ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. అలాగే చిరంజీవి సరసన ఈ హీరోయిన్లు మాత్రమే కాకుండా మృణాల్ థాకూర్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో చిరంజీవి గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే.. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్నది. ఈ సినిమా గ్రామీణ వాతావరణంతోపాటు పౌరాణిక నేపథ్యం ఉన్న కథగా తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి దొరబాబు అనే పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో త్రిష డబుల్ రోల్ కూడా చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మెగాస్టార్ కెరీర్‌లో 156వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో వృద్దుడి పాత్రలో కనిపింబోతున్నారనే విషయం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

గతంలో చిరంజీవి వృద్ధుడిగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదనే విషయం అందరికి తెలిసిందే. రిక్షావోడు, అందరివాడు, స్నేహం కోసం తదితర చిత్రాల్లో వయసు మళ్లిన పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాల్లో చిరంజీవి పాత్ర బాగున్నప్పటికీ.. అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
అయితే విశ్వంభర సినిమాలో వృద్దుడిగా నటిస్తున్నారనే విషయంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. దొరబాబుగా ముసలి పాత్రలో నటిస్తే గతంలో వెంటాడిన సెంటిమెంట్ ఈ సినిమాకు వర్తిస్తుందా? అనేది మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గతంలో వర్కవుట్ కాని సెంటిమెంట్‌ను విశ్వంభరతో బ్రేక్ చేస్తాడా? అనే విషయం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











