జెడి చక్రవర్తి రూపొందించిన హోమం సినిమా హాలీవుడ్ ది డిపార్టెడ్ సినిమాకు మక్కీ కాపీ అనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమా కాపీ చేయటం వల్ల ఓ కొత్త తలనొప్పి రాబోతోందని సమాచారం. ది డిపార్టెడ్ సినిమాను నిర్మించి వార్నర్ బ్రదర్స్ వారు ముంబయి కి చెందిన ఓ నేషనల్ లీడింగ్ పేపర్ లో ఈ చిత్రం కాపీ రైట్స్ పై ఓ లీగల్ నోటిస్ ఇచ్చారు. అందులో తాము 2006 లో నిర్మించిన ది డిపార్టెడ్ సినిమాకు ఆస్కార్ వచ్చిందని, దాని కాపీ రైట్స్ మొత్తం తమకే ఉన్నాయని ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే లీగల్ గా ఏక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని ఇచ్చారు. అలాగే తమ ది డిపార్టెడ్ చిత్రం 2002లో వచ్చిన ఇంటర్నెల్ ఎఫైర్స్ చిత్రం రైట్స్ తీసుకుని చేసామని చెప్పుకొచ్చారు. ఇండియాలో గాని మరెక్కడైనా తమ అనుమతి లేకుండా ది డిపార్టెడ్ సినిమాగానీ, సన్నివేశాలు గానీ కాపీ కొట్టరాదని, అలా చేస్తే కాపీరైట్స్ చట్టాన్ని అతిక్రమించినట్లేనని స్పష్టం చేసారు. మరి జెడీ చక్రవర్తి పూర్తి స్ధాయిలో కాపీ కొట్టి హోమం తీయటం జరిగింది. అంటే ఆయనా కాపీరైట్స్ అతిక్రమించినట్లేనా?