twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2500 థియేటర్లలో సూపర్ స్టార్ మూవీ: అయినా ఇక్కడ మాత్రం హిట్ డౌటే

    తమిళ్ లో "మెర్సల్" 2500కు పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది తెలుగు వెర్షన్ "అదిరింది" మాత్రం కేవలం నాలుగున్నర కోట్లకే అదిరింది చిత్రం అమ్ముడయింది.

    |

    రజినీ కాంత్,సూర్య, కార్తి, ధనుష్, విశాల్ వీళ్లంతా కోలీవుడ్ హీరోలే అయినా తెలుగులోనూ ఇక్కడి స్టార్లకి ఉన్నంత మార్కెట్ వీళ్లకీ ఉంది. ప్రతుయేకంగా అభిమానులూ ఉన్నారు. నిజానికి మన హీరోలనీ, మన సినిమాలనీ తమిళ ప్రేక్షకులు అంతగా నెత్తికెక్కించుకోరు గానీ మనవాళ్ళకి సహజంగానే అలాంటి ఫీలిగ్సేమీ లేవు అసలు పెద్దగా పరిచయం లేని హీరో విజయ్ ఆంటోనీ సినిమాలని కూడా హిట్ చేసే మనవాళ్ళు ఎవ్వరినైనా ఇట్టే ఓన్ చేసేసుకుంటారు. అయితే తెలుగు లో తనకంటూ సొంత మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలన్న కోలీవుడ్ హీరో ఇలయదళపతి విజన్ ని మాత్రం మనవాళ్ళు పెద్దగా పట్టించుకోరు.

    అదిరింది

    అదిరింది

    కోలీవుడ్ లో రజినీ తర్వాత సూపర్ స్టార్ అనిపిన్ పిలిపించుకునే స్థాయి హీరోకి తెలుగు లో మాత్రం కనీస లెక్కలో కూడా వసూళ్ళు ఉండవు. తుపాకీ, పోలీసోడు లాంటి సినిమాలతో తెలుగు మార్కెట్ లో ప్రవేశించాలని చూసినా దారుణమైన అపజయమే ఎదురయ్యింది. అయినా నిరాశపడని విజయ్ ఈసారి తన కొత్త సినిమా "మెర్సల్" ని "అదిరింది" పేరుతో తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సారి కూడా విజయ్ కి పెద్దగా కలిసి వస్తుందన్న నమ్మకం ఏమీ లేదు...

    2500కు పైగా థియేటర్లలో రిలీజ్

    2500కు పైగా థియేటర్లలో రిలీజ్

    ఇప్పటికైతే తమిళ్ లో "మెర్సల్" చిన్న సైజు సంచలనం గా మారింది. తమిళంలోనే ఈ చిత్రం 2500కు పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. తెలుగు వెర్షన్ కూడా కలిపితే లెక్క 330 చేరుతోంది. ఇప్పటిదాకా ఏ తమిళ సినిమా కూడా ఇంత భారీగా విడుదలైంది లేదు. రజినీ సినిమా ‘కబాలి'ని కూడా ఇంతకంటే తక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేశారట.

    250 స్క్రీన్లలో రిలీజ్

    250 స్క్రీన్లలో రిలీజ్

    "బాహుబలి" తర్వాత ఇంత భారీ స్థాయిలో రిలీజవుతున్న దక్షిణాది చిత్రం ఇదే. అమెరికాలో మామూలుగా తమిళ సినిమాలు తక్కువ థియేటర్లలోనే రిలీజవుతుంటాయి. కానీ ‘మెర్శల్'ను మాత్రం అక్కడ 250 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం.

    నాలుగున్నర కోట్లకే

    నాలుగున్నర కోట్లకే

    కానీ తెలుగు వెర్షన్ "అదిరింది" మాత్రం కేవలం నాలుగున్నర కోట్లకే అదిరింది చిత్రం అమ్ముడయింది. తెలుగు హక్కుల్ని శరత్ మరార్ రూ.4.6 కోట్లకు కొని రిలీజ్ చేస్తున్నాడు. తమిళనాడులో డెబ్బయ్‌ కోట్లు పలికిన ఈ చిత్రానికి పక్క రాష్ట్రాల్లో అంత గిరాకీ లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు విజయ్‌ ఇంకా స్టార్‌ అవలేదు. పోలీసోడు చిత్రాన్ని తీసిన అట్లీ ఈ మెర్సల్‌ సినిమా కూడా తీసాడు.

    ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు

    ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు

    రజనీకాంత్‌ సినిమాలని మినహాయిస్తే తమిళ చిత్రాల్లో అత్యధిక బిజినెస్‌ చేసిన చిత్రంగా ఇది నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేస్తే దీనిని హిట్‌ కింద లెక్కేసుకోవచ్చునట. హైప్‌ అయితే పతాక స్థాయిలో వుంది కనుక ఈ చిత్రం ఖచ్చితంగా బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుందని అనుకుంటున్నారు. అయితే తమిళనాడులో ఈమధ్య పెద్ద సినిమాలన్నీ పల్టీలు కొడుతోన్న నేపథ్యంలో దీని ఫలితం ఏమవుతుందో అనే భయం మాత్రం బయ్యర్లకి బాగా వుంది.

    English summary
    Will Kollywood Hero Ilayadalapathi Vijay Success This Time In Tollywood with Adirindi wichi is telugu version for tamiL "mersal"?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X