గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి 'మహాభారతం'లో జూ ఎన్టీఆర్...!
మామూలుగా తమ మీద వచ్చే గాసిప్స్ కు సినిమా వాళ్లు రియాక్ట్ కారు. చదివి వదిలేస్తుంటారు. అయితే, దర్శకుడు రాజమౌళి మాత్రం తన మీద ఏదైనా గాసిప్ వస్తే వెంటనే దానికి ట్విట్టెర్ ద్వారా వివరణ ఇచ్చేస్తుంటాడు. అలాగే, తాజాగా తను యన్టీఆర్ తో కలిసి 'దాన వీర శూర కర్ణ' సినిమా తీయనున్నట్టు వస్తున్న న్యూస్ కి వివరణ ఇచ్చాడు. అసలు తనకలాంటి ఉద్దేశం లేదనీ, ప్రస్తుతం చేస్తున్న 'ఈగ' తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాల్సివుందనీ చెబుతున్నాడు. ప్రస్తుతం తనకు మైథలాజికల్ చేసే ఆలోచన లేదంటున్నాడు. ఒకవేళ చేస్తే కనుక మహాభారతాన్ని రెండు భాగాలుగా తీస్తానని చెప్పాడు.
కృష్ణుడు ఎలా ఉంటాడు అని ఊహించుకుంటే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు రావాల్సిందే. ఇప్పుడు హీరోల్లో కృష్ణుడిగా ఎవరు నటిస్తే బాగుంటుందని అడిగితే మూకుమ్మడిగా జూ ఎన్టీఆర్ అని చెబుతారు. సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి మహాభారతాన్ని రెండు భాగాలుగా తీస్తానంటున్నాడు కాబట్టి ఒకవేళ తెరకెక్కిస్తే అందులో కృష్ణుడు పాత్ర యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తాడని చెప్పాడు. మల్టీస్టారర్ గా ఈ సినిమా రూపొందుతుందని, అందులో జూ ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తాడని పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా నందమూరి అభిమానులకు స్వీట్ న్యూస్ అనే చెప్పొచ్చు....


Click it and Unblock the Notifications











