Miss World పోటీలపై గందరగోళం.. ఇండియాలో ఫైనల్ వేదిక ఎక్కడంటే?
గ్లామర్ ప్రపంచంలో అందాల పోటీలను చూసేందుకు అందరూ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. కోట్లాది రూపాయల వ్యయం, తారల హంగులు, సినీ ప్రముఖుల సందడి మధ్య జరిగే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగుతుంటాయి.
అయితే ఈ సారి మిస్ వరల్డ్ 2023 పోటీలకు ఇండియా వేదికగా మారనున్నది. ఇండియాలో భూతల స్వర్గం పేర్కొనే ప్రదేశంలో పోటీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారనే వార్త విస్తృతం ప్రచారం అవుతున్నది. . అందాల పోటీ ప్రపంచంలో 71వ సారి జరుగుతున్న మిస్ వరల్డ్ కమిటీ సీఈవో జూలియా మార్లే ఇచ్చిన వివరాల్లోకి వెళితే..

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరుఫన వెల్లడిస్తున్న సమాచారం ఇది. మిస్ వరల్డ్ 2023 ఫినాలే పోటీలు కశ్మీర్‌లో జరుగుతున్నాయనే వార్త వాస్తవం కాదు. మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్తలో నిజం లేదు. మిస్ వరల్డ్ 2023 పోటీల ఫినాలే వేదికను పీఎంఈ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఎంపిక చేస్తుంది. ఆ తర్వాతే వేదికను అధికారికంగా ప్రకటిస్తుంది అని పోటీ కమిటీ చైర్మన్ జామిల్ సైదీ స్పష్టం చేశారు.

మిస్ వరల్డ్ 2023 పోటీల ఫినాలే వేడుక కశ్మీర్‌లో జరుగుతుందని ఇటీవల జూలియా మార్లే చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పీఎంఈ కమిటీ తోసిపుచ్చింది. ఆ ప్రకటన మాకు కొంత భావోద్వేగాన్ని కలిగించింది. కశ్మీర్ లాంటి అందమైన ప్రదేశంలో జరగడం మాకు ఎమోషనల్ పాయింట్ అని చెప్పారు.

71వ మిస్ వరల్డ్ 2023 పోటీలకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కశ్మీర్‌లో జరుగనున్నది. మిస్ వరల్డ్ క్రూ నవంబర్‌లో కశ్మీర్‌కు రానున్నది. ఈ పోటీలు డిసెంబర్ 8వ తేదీన జరుగుతాయి. డిసెంబర్ 8వ తేదీ కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని నిర్వాహకులు అన్నారు.
కశ్మీర్‌లో జరిగే కాన్ఫరెన్స్‌లో మిస్ వరల్డ్ కరోలినా బీలావ్‌స్కా, మిస్ వరల్డ్ ఇండియా సిని శెట్టి, మిస్ వరల్డ్ కరేబియన్ ఎమ్మీ పెనా తదితరులు హాజరవుతారు. ఈ పోటీలో 140 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటారు.


Click it and Unblock the Notifications











