నందమూరి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫలిస్తుందా?
తెలుగు చిత్ర సీమలో రాణించాలనే వారికి వారసత్వం అనేది టానిక్ లా పని చేస్తుందనే విషయం తెలిసిందే. వారసత్వం అనే అర్హత ఉంటే చాలు... చాలా మంది నిర్మాతలు వెనకాముందు ఆలోచించకుండా వారసులతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అందరి విషయంలోనూ వారసత్వం వాసి పని చేయదనేది కూడా తప్పకుండా ఒప్పుకోవాల్సిన సత్యం. అందుకు నందమూరి ఫ్యామిలీయే నిదర్శనం. సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా వారి కుటుంబంలో ఇప్పటి వరకు చాలా మంది తెరంగ్రేటం చేసినా.....ప్రేక్షకులు ఆదరించింది మాత్రం ఇద్దరినే. బాలయ్య, జూ ఎన్టీఆర్ మాత్రమే సినిమాల్లో అగ్రస్థానంలో రాణిస్తున్నారు. తారక రత్న, కళ్యాణ్ రామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వరుస ప్లాపులే వరిస్తుండటంతో నిలదొక్కుకోలేక పోతున్నారు. మరి వీళ్లకి నటించడం రాకనా? లేక వీళ్ల ఫేసులు, పేర్లు ప్రేక్షకులకు నచ్చలేదా? అదృష్టం కలిసి రాలేదా? అనే విషయం తేల్చడం కాస్త కష్టమే.
జూ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి తన టాలెంట్ తో పాటు తాత ఎన్టీఆర్ పేరు కూడా కారణమే. ఈ నేపథ్యంలో నందమూరి తారక రత్న కూడా ఇటీవలే తన పేరును ఎన్టీఆర్(నందమూరి తారక రత్న)గా మార్చుకున్నాడు. మరి తాత పేరు సెంటిమెంటు తారక రత్నకు ఎంత మేరకు ఫలిస్తుంది? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం తారక రత్న...కాదు కాదు ఎన్టీఆర్ 'నందీశ్వరుడు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల కాబోతోంది. చూద్దాం ఏం జరుగబోతోందో...


Click it and Unblock the Notifications












