రాజ్ తరుణ్ కథలో నిఖిల్.. అసలు విషయం ఏంటంటే..?
ఓ హీరోకు అనుకున్న కథలో మరో హీరో వచ్చి చేరడం ఇండస్ట్రీలో సర్వసాధారణం. కథ నచ్చక కొంతమంది హీరోలు తిరస్కరించగా.. వేరే హీరో చేసి భారీ హిట్లు కొట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. అలా ఏ కథ ఎవరి దగ్గరకు వెళ్తుంది.. ఎవరు చేస్తారనేది ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఓ కథ ఓ యంగ్ హీరో కోసం అనుకోగా.. మరో హీరో దగ్గరకు వెళ్లిందట. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
తాజాగా అర్జున్ సురవరంతో మంచి హిట్ కొట్టిన నిఖిల్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. తన తదుపరి చిత్రం సుకుమార్ - గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలె జరిగింది. కథ - స్క్రీన్ ప్లే సుకుమార్ అందించనుండగా.. ఈ సినిమాకి సూర్య ప్రతాప్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ కథ మొదటగా నిఖిల్ కోసం అనుకున్నది కాదంటూ ఓ టాక్ నడుస్తోంది.

రాజ్ తరుణ్ - సూర్యప్రతాప్ కాంబినేషన్‌లో వచ్చిన 'కుమారి 21F'ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తదుపరి సినిమా మళ్లీ రాజ్ తరుణ్ తోనే ఉంటుందని అప్పట్లో సూర్యప్రతాప్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ హఠాత్తుగా ఆయన నిఖిల్ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రాజ్ తరుణ్ కోసం అనుకున్న కథను తాత్కాలికంగా పక్కన పెట్టేశాడా? లేదంటే ఆ ప్రాజెక్టు అటకెక్కిందా? అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











