Budget 2024 OTT ఓటీటీ, వినోద రంగంపై సీతమ్మ వరాలు జల్లు కురిసేనా?
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 1వ తేదీన గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇటీవల కాలంలో టెలివిజన్, ఓటీటీ రంగాలు గణనీయంగా వృద్ధి సాధించిన నేపథ్యంలో వినోద పరిశ్రమపై వరాలు కురిపిస్తారా? అనే ఆసక్తి ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొన్నది. అయితే గత ఏడాది బడ్జెట్‌ను పరిశీలనలోకి తీసుకొంటే..
ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా విషయానికి వస్తే.. 1.9 ట్రిలియన్ రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇటీవల కాలంలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీ, శాటిలైట్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్, ఆదరణ పెరిగింది. దాంతో ఈ రెండు విభాగాల వల్ల ట్యాక్సులు, రాబడి విషయంలో దాదాపు 20 శాతం వృద్ధిని సాధించింది.

Recommended Video

ఓవర్ ది టాప్ (OTT) ఫ్లాట్‌ఫామ్స్ వృద్ది ఊహించని విధంగా పెరిగిపోవడంతో ఈ రంగంపై ఎలాంటి వరాలు కురిపిస్తారు? లేదా ఏదైనా మినహాయింపులు ఇస్తారా? ఓటీటీలో హింస, అశ్లీలత పెరుగుతుందనే విమర్శలు వస్తున్నందున దానిపై ఏదైనా స్పందిస్తారా? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.
ఇక రేడియో సెక్టార్‌ను ప్రోత్సహించడానికి, అలాగే శ్రోతల సంఖ్యను పెంచడానికి ప్రోత్సాకాలు, ట్యాక్స్ విషయంలో ఎదైనా వెసులుబాటు కలిగించే అవకాశం ఉంది. జీఎస్టీ (GST) తగ్గించడం ద్వారా రేడియో ఇండస్ట్రీకి మేలు చేసేలా ఏదైనా ప్రయత్నాలు చేపట్టే అవకాశం ఉందని ట్రేడ్, ఇండస్ట్రీ నిపుణులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











