వర్మ సినిమాలో నిత్యానంద నటిస్తారా?
రామ్ గోపాల్ వర్మ సినిమాలో నిత్యానంద హీరో కానున్నారా? నిత్యానంద నిజ జీవిత గాధ ఆధారంగా వర్మ సినిమా రూపొందించనున్న విషయం తెలిసిందే. నిత్యానంద స్వామి బాలీవుడ్‌లో ప్రత్యక్షం కానున్నట్లు కోలీవుడ్ కోడైకూస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిత్యానంద స్వామి కారు డ్రైవర్ లెనిన్ రాసలీల సీడీలు ఒకటి తర్వాత ఒకటి గా మొత్తం మూడు సీడీలు విడుదల చేయగా అత్యంత చర్చనీయాంశంగా మారిన నిత్యానంద స్వామి ఉదంతంతో మొత్తం ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఉవ్విళ్ళూరుతున్నారు.
ఈ మేరకు గత వారమే వార్తలు వచ్చినా హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అన్న అనుమానం ఉండేది. అయితే ఈ సినిమాలో హీరో సాక్షాత్తు నిత్యానంద స్వామి ఉంటారన్నది ఆశ్చర్యకరమైన విషయం. అయితే హీరో యిన్ ఎవరన్నది ఇప్పుడున్న ప్రశ్న. తనపై ఇప్పుడు కున్న కేసులు, పోలీసుల వెతుకులాటలు మొత్తం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత బయటికి వచ్చి షూటింగ్ లో పాల్గొ నేందుకు సిద్దపడినట్లు సమాచారం.
భక్తులకు ఇది షాక్ నిచ్చేవార్త అయినా ఇది నమ్మక తప్పడం లేదు. రాసలీలల భాగోతం బయటపడ్డాక స్వామీజీపై రోజుకో కొత్త విషయాలు వినిపిస్తున్న ప్పటికీ స్వామీజీ భక్తులకు ఎలాంటి సందేశాలను నేరుగా ఇవ్వకపోవడం శోచనీయం. నగర పోలీసులకూ ఈ విషయాలు తలనొప్పిగా పరిణమిం చాయి. ఏ విషయాలు నిజం? ఏ విషయాలు వదంతులు? అన్నది తెలియక తికమక పడుతున్నారు.


Click it and Unblock the Notifications











