‘అరవింద’ ఆ రికార్డులను బద్దలు కొడుతుందా? ఎన్టీఆర్ ముందు ఐదు సవాళ్లు.. ఫ్యాన్స్‌లో బెంగ!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ వలయంలో అరవింద సమేత ఫీవర్ మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్‌కు సిద్దమైంది. టీజర్లు, ట్రైలర్లకు విశేషమైన రెస్పాన్స్ రావడం, తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ జోడి కట్టడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దసర పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపేయడం ఖాయమంటున్నాయి సినీ ట్రేడ్ వర్గాలు. అయితే ఇతర టాలీవుడ్ హీరోలతో పోల్చుకొంటే యంగ్ టైగర్‌ ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయి. ఈ టార్గెట్లను ఎన్టీఆర్ అధిగమిస్తాడా అనే ప్రశ్న ఫ్యాన్స్‌లో బెంగ పట్టుకొన్నది. అరవింద సమేత రిలీజ్ ముందు ఎన్టీఆర్ ఎదుట ఐదు రికార్డులు లక్ష్యంగా నిలిచాయి. అవేమిటంటే..

 భారీగా అడ్వాన్స్ బుకింగ్‌లు

భారీగా అడ్వాన్స్ బుకింగ్‌లు

టాలీవుడ్‌కు యూఎస్ మార్కెట్ బొనాంజాగా మారింది. ఈ చిత్రం ఒక రోజు ముందే అమెరికాలో రిలీజ్ అవుతున్నది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 10 రాత్రి యూఎస్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమాకు కేవలం అమెరికాలోనే కాకుండా తెలుగు ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‌లు నమోదయ్యాయి.

జై లవకుశ రికార్డుల మోత

జై లవకుశ రికార్డుల మోత

ఇటీవల ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగించింది. ఎన్టీఆర్ కెరీర్‌లో మునుపెన్నడూ లేని విధంగా తొలిరోజే రూ.45.60 కోట్ల వసూళ్లను రాబట్టింది. జనతా గ్యారేజ్ స్థాపించిన రూ.41 కోట్ల రికార్డును బద్దలుకొట్టింది.

ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా ఇదే

ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా ఇదే

జనతా గ్యారేజ్, జై లవకుశ చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. జై లవకుశ చిత్రం రూ.134 కోట్ల కలెక్షన్లను రాబట్టగా, జనతా గ్యారేజ్ రూ.130.90 కోట్లు వసూలు చేసింది. అరవింద సమేత చిత్రం ఈ రికార్డులను అధిగమిస్తుందా అనే కొద్ది రోజుల్లో తేలనున్నది.

Recommended Video

Aravinda Sametha Veera Raghava Twitter Review అరవింద సమేత ట్విట్టర్ రివ్యూ
మహేష్, రాంచరణ్, పవన్ రికార్డులు

మహేష్, రాంచరణ్, పవన్ రికార్డులు

ఇక ఎన్టీఆర్ ముందు మహేష్ బాబు, రాంచరణ్ తేజ్, పవన్ కల్యాన్ భారీ రికార్డులను ముందుంచారు. తొలి రోజున అజాతవాసి రూ.60.50 కోట్లు, భరత్ అనే నేను రూ.53.80, రంగస్థలం రూ.43.80 కోట్లు వసూలు చేశాయి. ఇక అరవింద సమేత చిత్రం ఈ రికార్డులను కొల్లగొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

తొలివారం ఓ సవాల్

తొలివారం ఓ సవాల్

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎన్టీఆర్‌కు మరో రికార్డు సవాల్‌గా నిలిచింది. ఈ చిత్రం తొలి వారంలోనే రూ.127.10 కోట్లు వసూలు చేసింది. ఇది నాన్ బాహుబలి చిత్రాల్లో ఓ రికార్డు. ఈ రికార్డును త్రివిక్రమ్, ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారా అనేది వేచి చూడాలి.

ఏడాదిలో అత్యధికంగా వసూళ్లు

ఏడాదిలో అత్యధికంగా వసూళ్లు

2018 సంవత్సరంలో ఓవరాల్‌గా టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో భరత్ అనే నేను, రంగస్థలం, గీతా గోవిందం చిత్రాలు రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. భరత్ అనే నేను రూ.225 కోట్లు, రంగస్థలం రూ.216 కోట్లు, గీతా గోవిందం రూ.130 కోట్లు వసూలు చేశాయి. ఈ రికార్డులను తుడిచిపెట్టే సత్తా అరవింద సమేతకు ఉందా అనే ప్రశ్న మొదలైంది. ఈ ప్రశ్నలకు రెండు రోజుల్లో సుమారుగా సమాధానం దొరికే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X