'తొలిప్రేమ, ఖుషి’లాగా పవన్ ‘గబ్బర్ సింగ్’కి నంది ఖాయమట..!

By Sindhu

హిందీలో గతేడాది ఘన విజయం సాధించిన 'దబాంగ్" చిత్రాన్ని తెలుగులో 'గబ్బర్ సింగ్" పేరుతో రీమేక్ చేస్తుండడం తెలిసిందే. 'దబాంగ్" చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి..'గబ్బర్ సింగ్" చిత్రానికి నంది అవార్డులు రావడం ఖాయమని పనవ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిక్సయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'తొలి ప్రేమ" చిత్రానికి అత్యధికంగా ఆరేడు నంది అవార్డులొచ్చాయి. ఆ తర్వాత 'ఖుషీ" చిత్రానికి కూడా ఒకటో రెండో వచ్చినట్టున్నాయి. ఇప్పుడు మళ్ళీ 'గబ్బర్ సింగ్" చిత్రానికి కూడా వస్తాయని ఆశిస్తున్నారు.

రీమేక్ సినిమాలకు నంది అవార్డులివ్వకూడదనే నిబంధనను ఇంతకుముందు స్ట్రిక్ట్ గా అమలు చేసేవారు. అయితే..ఇటీవలకాలంలో ఆ నిబంధనకు నీళ్లొదిలేసినట్టే కనబడుతోంది. కాబట్టి 'గబ్బర్ సింగ్"కు నంది అవార్డులు ఖాయం. ఇకపోతే, పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ అయిన 'దబాంగ్" చిత్రానికి జాతీయ అవార్డు ఇవ్వడం ద్వారా జాతీయ అవార్డుల స్థాయి పడిపోయిందని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్వయంగా 'దబాంగ్" చిత్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ కూడా ఆ చిత్రానికిగాను నేషనల్ అవార్డు రావడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..'దబాంగ్" చిత్రాన్ని నిర్మించింది సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్. అవార్డు కోసం తమ్ముడితో లాబీయింగ్ చేయించి. అవార్డు రావడం పట్ల తాను మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం ద్వారా నేషనల్ అవార్డుల పరువు మరింత దిగజార్చాడు కండలవీరుడు సల్మాన్ ఖాన్..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X