గాడితప్పిన చరణ్ కు భారీ హిట్ కోసం పవన్ ప్లాన్..!
'ఆరెంజ్" ప్లాప్ తర్వాత కొంత డిప్రెషన్ కు గురైన రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు అంగీకరిస్తున్న విషయం తెలిసిందే..అందులో సంపత్ నంది డైరెక్షన్ లో మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న 'రచ్చ" ఒకటి కాగా వంశీపైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించనున్న మల్టీస్టారర్ మూవీ ఒకటి..ఇందులో రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ కూడా నటించనున్న విషయం తెలిసిందే..వీటితో పాటు వివి వినాయక్ రూపొందించే చిత్రంలోనూ నటించడానికి రామ్ చరణ్ అంగీకరించాడు..ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు..
కాగా ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మించడానికి రెడీ అవుతున్నాడు..'జల్సా" తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్ మార్" చిత్రానికి పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యే ఓ ప్రేమకథతో పవన్ ని ఒప్పించాడని ఆ కథనచ్చి పవన్, రామ్ చరణ్ తో సినిమా నిర్మించడానికి రెడీ అయిపోయాడని ఫిలింనగర్ టాక్..ఇదిలావుంటే 'ఆరెంజ్" ప్లాప్ తో గాడితప్పిన రామ్ చరణ్ కెరీర్ మళ్ళీ సాఫీగా సాగాలంటే ఓ భారీ హిట్ ని రామ్ చరణ్ కు అందించాలనే ఉద్దేశంతో బాబాయ్ అబ్బాయ్ కోసం మంచి స్కెచ్ వేస్తున్నాడని ఫిలింసర్కిల్స్ లో చెప్పుకుంటున్నారట.


Click it and Unblock the Notifications











