»   » డబ్బు సంపాదించే కొత్త దారిలో పవన్... మహేష్‌కు పోటీ తప్పదా?

డబ్బు సంపాదించే కొత్త దారిలో పవన్... మహేష్‌కు పోటీ తప్పదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ రేంజి ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నెం.1 స్థానంలో కొనసాగుతున్న ఆయన పారితోషికం విషయంలోనూ, ఆయన సినిమాల బిజినెస్ విషయంలోనూ అగ్ర స్థానంలో ఉన్నారు. గతంలో పెప్సి లాంటి సాఫ్ట్ డ్రింకు కంపెనీల తరుపున పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

కారణం ఏమిటో తెలియదు కానీ...చాలా కాలంగా పవన్ కళ్యాణ్ వాణిజ్య ప్రకటనల ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఓకే అంటే కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి ప్రచారం చేయించుకోవడానికి పలు కార్పొరేట్ సంస్థలు రెడీగా ఉన్నాయి. కానీ పవన్ మాత్రం వాటికి దూరంగానే ఉంటూ వస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తాజాగా తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కార్పొరేట్ సంస్థల తరుపున ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు సంస్థలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఒక మంచి ఉద్దేశ్యం ఉందని....వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించి, వీలైనంత ఎక్కువ డబ్బు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనక ఒక మంచి ఉద్దేశ్యం ఉంటుందని....వాణిజ్య ప్రకటనల ద్వారా ఆయన ఎంత ఎక్కువ సంపాదిస్తే, అంత ఎక్కువ మందికి మంచి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.

కాగా...పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల ప్రచార విభాగంలో నెం.1 స్థానంలో కొనసాగుతున్న మహేష్ బాబుకు తీవ్రమైన పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కేవలం పలు బ్రాండ్లు ప్రచారం చేయడం ద్వారా సంవత్సరానికి రూ. 50 కోట్ల వరకు సంపాదిస్తున్నారని అంచనా.

English summary
It’s heard that a soft drink beverage brand and a DTH brand too are in talks with Pawan Kalyan to sign an agreement. So, all you fans of Power Star watch out for the star Mania taking the small screens too by storm with your favorite star as ambassador of many corporate brands.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu