ProjectK Release కల్కి రిలీజ్ అవుతుందా? కాదా? ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో టెన్షన్..టెన్షన్!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో దిగ్గజ నిర్మాత సీ అశ్వీన్ దత్ నిర్మిస్తున్న ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898 AD. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమా చివరిదశ చిత్రీకరణలో ఉంది. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రకటించిన డేట్‌కు రిలీజ్ అవుతుందా? అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
ఇటీవల ప్రాజెక్ట్K మూవీలోని ఓ పాట చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అంతా ఇటలీకి వెళ్లింది. ప్రత్యేక విమానంలో బయలు దేరిన ఫోటోలను టీమ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. అక్కడ అందమైన బీచ్ లో ప్రభాస్ అండ్ దిశా పటాని పై అదిరిపోయే రొమాంటిక్ సాంగ్‌ను ప్లాన్ చేశారు. దాదాపు 30 మందికిపైగా ఉన్న క్రూ భారీగా తరలివెళ్లింది. ఇటలీలో వారు సుమారుగా 1 వారం పాటు పాటను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

ఇటలీలో కల్కి మూవీ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందనేది తాజా సమాచారం. దాదాపు రెండు నెలల ముందే షూటింగ్ ని పూర్తి చేసుకుంటున్నప్పటికీ ఈ మూవీ రిలీజ్‌రే మాత్రం ఓ అడ్డంకి వచ్చి పడుతుంది. దాని వల్ల సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తే ప్రభాస్ అభిమానులకు తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. ఇంతకీ అసలు రిలీజ్ కి అడ్డు వస్తున్న విషయం ఏంటి..?
ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో టాప్ కంపెనీస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ లాస్ట్ స్టేజి సిజి వర్క్ జరుగుతుందట. ఇందుకు సంబంధించిన ఫైనల్ అవుట్ ఫుట్ రావాల్సి ఉంది. ఆ వర్క్ అంతా ఇన్ టైంలోనే రానుందని సమాచారం. అయితే వచ్చిన తరువాత ఆ వర్క్ క్వాలిటీని మూవీ టీం చెక్ చేయాల్సి ఉంది. అది అప్ టు ది మార్క్ ఉంటే.. మే 9 రిలీజ్ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు,

ఒకవేళ వచ్చిన వర్క్ మూవీ టీం అనుకున్న క్వాలిటీకి మ్యాచ్ కాకపోతే.. మళ్ళీ రీ వర్క్ కి పంపించనున్నారు. ఈ ఒక్క విషయమే ఇప్పుడు కల్కి రిలీజ్ కి అడ్డంకిగా మారింది. ఈ లాస్ట్ స్టేజి సిజి వర్క్ త్వరలోనే రానుందట. మరి అది మూవీ టీం అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ఈ శివరాత్రికి ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తుంది. మరి ఆ అప్డేట్ ఏంటో చూడాలి.
సినీ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తోపాటు రాజేంద్ర ప్రసాద్, దిశాపటానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో నాని, రానా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమాకు కొటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, జోర్డే సినిమాటోగ్రఫిని, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











