twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ సహాకారంతో బన్నీ లవ్ ఓకే మరి ప్రభాస్ సంగతి ఏంటీ..

    By Nageswara Rao
    |

    తెలుగు చిత్ర సీమలోకి రెబల్ స్టార్ వారసుడిగా అడుగుపెట్టి తన నటనా చాతుర్యంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు యంగ్ రెబల్ స్టార్. ఇటీవల కాలంలో ప్రభాస్ కుమంచి హిట్ సినిమాలు లేకపోయేసరికి వార్తల్లోకి బాగా నిలుస్తున్నారు. డార్లింగ్ సినిమాలో తనతో పాటు నటించినటువంటి కాజల్ తోఈమద్య ప్రభాస్ ప్రేమలో మునిగితేలుతున్నారని ఫిలిమ్ నగర్ సమాచారం. డార్లింగ్ చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచి ప్రభాస్, కాజల్ ల మద్య ఎఫైర్ సాగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమలో ఘాటైన టాక్ అయితే ఇది నిజమేనని నిరూపించే అనేక సంఘటనలు మీడియా కంటికి చిక్కాయి. ప్రముఖం గా షూటింగ్ కి వీరిరువురు జంటగా హాజరుకావడం, సాయంత్రం కలిసి డిస్కో లకు వెళ్ళడం, భోజన సమయాల్లో వీరిద్దరే ఏకాంతంగా గడపటం ఇవన్నీ వీరి ఘాటైన్ రిలేషన్ షిప్ మరియు ప్రేమను తెలియజేస్తున్నాయని సినీ పెద్దలు భావిస్తున్నారు.

    డార్లింగ్ చిత్రం పూర్తి అయిన తర్వాత ప్రభాస్ మరియు కాజల్ జంటగా మరో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాలో కాజల్ నే ప్రభాస్ హీరొయిన్ గా దర్శకుడికి సజెస్ట్ చేసినట్లుగా తెలిసింది. కాబట్టి త్వరలోనే కాజల్, ప్రభాస్ లు ఒకటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసినిమాకి దర్శకత్వం దశరధ్ వహిస్తున్నారు. మిస్టర్ ఫర్ ఫెక్ట్" ని అంటూ త్వరలో మన ముందుకి రాబోతున్న ప్రభాస్ ఈ చిత్రం కోసం ఒక కొత్త లుక్ ని ట్రై చేశాడు. డిఫరెంట్ లుక్ అనగానే జుట్టు పెంచడమో, తగ్గించడమో చేసే మన హీరోలందరిలానే తను కూడా అంత కత్తెర వేయించుకుని, స్పైక్స్ తో నిజంగానే కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే కొత్త అయిన ప్రతీది బాగుండాల్సిన అవసరం లేదు కనుక ఈ గెటప్ కూడా అలానే బాలేదు. అసలే ఈ మద్య డల్ గా కనిపిస్తున్న ప్రభాస్ ఈ లుక్ తో మరింత నీరసంగా కనిపిస్తున్నాడని అభిమానులు అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X