Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
నిహారిక, ప్రభాస్ మ్యారేజ్ రూమర్.. అసలు నిజం వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి!
Recommended Video
గత కొంత కాలంగా ప్రభాస్ పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ పెళ్లి గురించి రూమర్లు ఎక్కువయ్యాయి. ప్రభాస్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. ఈ వార్తలపై స్వయంగా మెగాస్టార్ చిరంజీవి స్పందించి వివరణ ఇచ్చారు. నిహారిక ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ పెళ్లి వార్తలు
బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ పెళ్లి గురించి చర్చ జాతీయ వ్యాప్తంగా మొదలైంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. కానీ ప్రభాస్ సాహో చిత్రంతో బిజీ అయిపోయాడు.
ప్రభాస్, నిహారిక పెళ్లి రూమర్స్
ప్రభాస్, నిహారిక వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు మొదలయ్యాయి. దీనితో గురించి నెటిజన్లలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
గాలివార్తలు అంటూ కొట్టిపారేసిన మెగాస్టార్
ప్రభాస్, నిహారిక వివాహం గురించి రూమర్లు ఎక్కువవుతుండడంతో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియాలు కథనాలు వెలువరుస్తున్నాయ. ప్రభాస్, నిహారిక మ్యారేజ్ రూమర్ లో ఎటువంటి వాస్తవం లేదని మెగాస్టార్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన స్టేట్ మెంట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.
హీరోయిన్గా నిహారిక
నిహారిక ప్రస్తుతం హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటిస్తోంది. నిహారికకు ఇప్పట్లో వివాహం చేయాలనే ఉద్దేశం తమ కుటుంబానికి లేదని చిరంజీవి తేల్చారు. నటిగా నిహారికకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.
ఒక మనసు చిత్రంతో
ఒక మనసు చిత్రంతో నిహారిక హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. ప్రస్తుతం నిహారిక తెలుగు తమిళ భాషల్లో నటిస్తోంది. ఆ మధ్యన నిహారికకు సాయిధరమ్ తేజ్ తో వివాహం అంటూ కూడా రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలని కూడా మెగా ఫ్యామిలీ ఖండించింది.
ప్రభాస్ ఇంట్లో అలా
ప్రభాస్ కుటుంబ సభ్యులు అతడికి వివాహం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సాహో చిత్రం తరువాత ప్రభాస్ వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ వివాహం చేసుకునేలోపు ఇంకెన్ని రూమర్లు వ్యాపిస్తాయో చూడాలి.