»   » కంగనాతో ఎఫైర్ గొడవ: హృతిక్ తప్పులేదని తేలింది (ఇదిగో ప్రూఫ్స్)

కంగనాతో ఎఫైర్ గొడవ: హృతిక్ తప్పులేదని తేలింది (ఇదిగో ప్రూఫ్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య గత కొంతకాలంగా ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ఈ మధ్య మీడియాలో తనకు హృతిక్ ఏదో ఎఫైర్ ఉందనే విధంగా ప్రవర్తిస్తుండటమే ఇందుకు కారణం.

కంగనా ప్రవర్తనతో తన ఇమేజ్ డ్యామేజ్ అవ్యే విధంగా ఉండటంతో హృతిక్ ..కంగనాకు నోటీసులు పంపాడంతో ఈ వివాదం ఇంకా ముదిరింది. గతంలో వీరిద్దరూ ప్రేమించుకుని విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయమై కంగనా మీడియాతో ఎప్పుడు మాట్లాడినా తన పేరును ప్రస్తావిస్తోందంటూ హృతిక్‌ కేసు వేశాడు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరి ముందు తనకి క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నాడు.

ఈ విషయమై కంగనా స్పందిస్తూ.. తన తరఫు లాయిరు తో ఆయా చట్టాల కింద కేసులు నమోదు చేయించి హృతిక్‌కు నోటీసులు పంపింది. తాను ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడూ హృతిక్‌ పేరు ప్రస్తావించలేదని ఇది పరువు నష్టం ఎలా అవుతుందంటూ ఆరోపించింది. తనకు రోజుకు హృతిక్ మెయిల్ నుంచి 50 మెయిల్స్ వచ్చేవని చెప్పింది. హృతిక్ మెయిల్ నుంచితనకు సెన్సెలెస్ ఫొటోలు, వీడియోలు వచ్చేవని ఆరోపించింది. హృతిక్ తనను ప్రెవేట్ పార్టీలకు పిలిచేవాడని కంగనా చెప్పడం గమనార్హం. కంగనాను కలిసేందుకు హృతిక్ పారిస్ కూడా వెళ్లాడని అప్పట్లో వార్తలొచ్చాయి.

అయితే ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంగనాకు హృతిక్ ప్రేమ పేరిట ఎలాంటి ఈమెయిల్స్ పంపలేదని పోలీసులు తేల్చారు. అయితే కంగనా నుండి మాత్రం ఆరు నెలల వ్యవధిలో దాదాపు 3 వేల ఈమెయిల్స్ హృతిక్‌కు వెళ్లాయట. అయితే హృతిక్ పేరుతో ఉన్న ఫేస్ ఈమెయిల్ అకౌంటుతో కంగనాను ఎవరో బోల్తా కొట్టించారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆమెకు మెయిల్స్ పంపిన హెచ్ఆర్ రోషన్ ఎట్ ఈమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్ ఐడీతో హృతిక్ కు ఎలాంటి సంబంధం లేదని తేలింది.

హృతిక్ ఫోన్ కాల్స్ కూడా పోలీసులు పరిశీలించారు. ఏడేళ్లలో నాలుగుసార్లు మాత్రమే కంగనతో అతను మాట్లాడాడట. అదే విధంగా కంగనాను కలిసేందుకు హృతి పారిస్ కూడా వెళ్లలేదని అతని పాస్ పోర్టు రికార్డులను బట్టి తేలిందట. మొత్తానికి ఈ వ్యవహారంలో హృతిక్ రోషన్ తప్పేమీ లేదని తేలింది.

అయితే కంగనా నుండి తనకు వచ్చిన ఈమెయిల్ కాపీలను హృతిక్ పోలీసులకు అందజేసారు. అందుకు సంబంధించిన కాపీలు బయటకు లీక్ అయ్యాయి. వాటిపై మీరూ ఓలుక్కేయండి...

కంగనా పంపిన మెయిల్స్

కంగనా పంపిన మెయిల్స్


కంగనా నుండి తనకు వచ్చిన ఈమెయిల్ కాపీలను హృతిక్ పోలీసులకు అందజేసారు.

నేను రెడీ..

నేను రెడీ..


నేను రెడీ అంటూ కంగనా నుండి హృతిక్ వచ్చిన ఈమెయిల్... మరి దేనికి రెడీనో?

మెయిల్స్

మెయిల్స్


కంగనా నుండి తనకు వచ్చిన ఈమెయిల్ కాపీలను హృతిక్ పోలీసులకు అందజేసారు.

సో సెక్సీ అంటూ

సో సెక్సీ అంటూ


బేబీ యూ సో సెక్సీ అంటూ మెయిల్స్

English summary
Leaked emails provide insight into what's going in the legal battle between Hrithik and Kangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu