'నా రూటే సెపరేటు!' అంటున్న రాజశేఖర్

ఓ అమ్మాయి తాను చాలా ప్రమాదంలో ఉన్నానంటూ కాల్ చేస్తుంది. ఆమె తండ్రి పెద్ద కోటిశ్వరుడు. ఆయన కిడ్నిమార్పిడి కోసం విదేశాలకు వెళితే ఆమె చుట్టాలు,ఫ్యామిలి లాయిరు కలసి ఆమెను చంపి ఆ ఆస్ధి రాయించుకోవటానికి ట్రై చేస్తారు. అప్పుడు మన హీరో ఆమె భర్తగా ఆ ఇంటిలోకి ప్రవేశించి వాళ్ళకు బుద్ది చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతనికి తెలియదు తను తెలియక మరో ట్రాప్ లో ఇరుక్కున్నానని.ఇలా ట్విస్టులతో కామెడీతో నడిచే ఈ చిత్రం ఇక్కడా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.
అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రను రాజశేఖర్ చేస్తూంటే పార్వతి మిల్టన్ చేసిన ఫోన్ కాల్ చేసిన అమ్మాయి పాత్రను భూమిక చేస్తుందని, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవర్ పాత్రను అంకిత చేయవచ్చునని సమాచారం. ఇక ఈ చిత్రానికి మరో ప్రక్క నాగార్జున,విజయశాంతి నటించిన జానకిరాముడు టైటిల్ కూడా పరిశీలుస్తున్నారు. చిరునవ్వుతో సినిమా తర్వాత హిట్స్ లేని దర్శకుడు రామ్ ప్రసాద్ చేస్తున్న మలి ప్రయత్నం ఇది కావటంతో అందరికి బాగానే అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











