For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రజనీ, పవన్ ప్రభంజనం సృష్టిస్తారా? .. చిరంజీవి ట్రెండ్ మారుస్తారా?

  By Rajababu
  |
  రజనీ ప్రభంజనం సృష్టిస్తారా ?

  సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేట్రంపై కొనసాగుతున్న ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. ముందుగా చెప్పిన విధంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆదివారం (డిసెంబర్ 31న) ప్రకటన చేశారు. దీంతో అభిమానుల్లో కొత్త సంవత్సరం ముందే వచ్చినట్లయింది. కానీ రాజకీయ నేతలు అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు. సినీ తారలు వారి రాజీకీయాల గురించి ఓసారి పరిశీలిస్తే..

   దక్షిణాదిలో సినీ పాలిటిక్స్

  దక్షిణాదిలో సినీ పాలిటిక్స్

  దక్షిణాదిలో వచ్చే ఎన్నికల్లో సినీ గ్లామర్‌ దుమ్మురేపే విధంగా కనిపిస్తున్నది. ప్రధానంగా తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లో రాజకీయాలపై సినీ ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉంది. దీంతో 2019 ఎన్నికలు చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

  రాజకీయ క్షేత్రంలో పవన్ కల్యాణ్

  రాజకీయ క్షేత్రంలో పవన్ కల్యాణ్

  ఇప్పటికే రాజకీయ క్షేత్రంలో పవన్ కల్యాణ్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ట్విట్టర్ నుంచి రాజకీయాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యనే సుడిగాలి పర్యటనలు చేసి వచ్చాడు. జనసేన పార్టీ సైనికులను ఏకతాటిపైకి తెచ్చే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నాడు.

   కన్నడలో రాజకీయాల్లో ఉపేంద్ర

  కన్నడలో రాజకీయాల్లో ఉపేంద్ర

  ఇక కన్నడ రాజకీయాల్లో కొత్తగా మరో సినీ కెరటం ఎగిసిపడేందుకు సిద్ధమైంది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఇటీవల కర్ణాటక ప్రగ్యావంత జనతా పార్టీ పేరుతో రాజకీయ ప్రకటన చేశాడు. సినీరంగంలో తనకున్న క్రేజ్‌ను ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నాడు.

   దూసుకొచ్చిన రజనీకాంత్

  దూసుకొచ్చిన రజనీకాంత్

  దక్షిణాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాజాగా రజనీకాంత్ దూసుకొస్తున్నాడు. గత దశాబ్దకాలంగా రాజకీయాల్లోకి వస్తాడా అనే సందేహానికి రజనీ ఓ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లలో పోటీచేస్తామని ప్రకటన చేయడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

  తమిళంలో రాజకీయాల్లో సంక్షోభం

  తమిళంలో రాజకీయాల్లో సంక్షోభం

  గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం భారీ సంక్షోభమే కనిపిస్తున్నది. జయ మరణం తర్వాత పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. దీంతో అన్ని పార్టీలో ఓ రకమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు ఓటర్లు చుక్కలు చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

   ప్రతికూల పరిస్థితుల్లో రజనీకాంత్

  ప్రతికూల పరిస్థితుల్లో రజనీకాంత్

  తమిళ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను ఆసరాగా చేసుకొని రజనీకాంత్ పాలిటిక్స్‌లోకి సిద్ధమయ్యాడు. అయితే ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల రాజకీయ పరిస్థితులను సానుకూలంగా మార్చుకొంటాడా లేక చిరంజీవి మాదిరిగానే రాజకీయాల్లో జీరో అవుతాడా అనే కాలమే సమాధానం చెబుతుంది.

   మెగాస్టార్ చిరంజీవిని అధిగమిస్తారా?

  మెగాస్టార్ చిరంజీవిని అధిగమిస్తారా?

  కాగా గతంలో రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన ప్రభావాన్ని చూపలేక జీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా రజనీకాంత్ తన ప్రసంగంలో కూడా చెప్పారు. రాజకీయాల్లో చిరంజీవికి ఎదురైన పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్తగా రజనీ అడుగులేస్తాడా లేదా అనే వేచిచూడాల్సిందే.

  English summary
  Superstar Rajinikanth in a thunderous declaration today at Chennai's Raghavendra Mandapam said loud and clear, "I am entering politics.". As per schedule, the next Tamil Nadu Assembly polls will be held in 2021.Rajinikanth said he was confident of getting people's support and represented the common man. Further advising his fans to "think good, talk good and do good".
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more