బాబాయ్, బాలయ్యకు ధీటుగా... చెర్రీ, తోడుగా బన్నీ!

By Bojja Kumar

హైదరాబాద్: సినీ తారల రంగ ప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టాలీవుడ్ టాప్ స్టార్లయిన పవన్ కళ్యాన్, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఈ సారి రాజకీయ ప్రచారంలోకి దిగారు. ఓ వైపు రాష్ట్రంలో విభజన తర్వాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితిలో.....సినీ స్టార్లు రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు ఈ మేరకు వారిని కన్విన్స్ చేసి సక్సెస్ అయ్యాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీని ఇప్పుడు స్థాపించడానికి ప్రధాన కారణంగా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితులే అని చెప్పక తప్పదు. ఒక వేళ రాష్ట్ర విభజన ఇప్పుడు జరిగి ఉండకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఇంత ఆఘమేఘాల మీద వచ్చి ఉండేదికాదేమో.....!

తాను ఇప్పటికిప్పుడు పోటీకి దిగితే లాభం లేదని భావించిన పవన్ కళ్యాణ్.... కాంగ్రెస్ పార్టీపై ఉన్న కసిని టీడీపీ, బీజేపీకి తన మద్దతు ప్రకటించడం ద్వారా తీర్చుకుంటున్నారు. కాగా......పవన్ కసిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గట్టెక్కించేందుకు పవన్ సోదరుడు చిరంజీవి తన శక్తిని అంతా ఉపయోగిస్తున్నారు.

టీడీపీ, బీజేపీని అధికారంలోకి తేవడానికి పవన్ కళ్యాణ్‌‌‌కు బాలయ్య ఏకమైతే...... కాంగ్రెస్ తరుపున ఒంటరి పోరు సాగిస్తున్న చిరంజీవికి రామ్ చరణ్ మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాన్నకు అండగా రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్‌కు తోగా ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ కూడా దిగుతాడని ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ ఇప్పటికే తన మద్దతు తండ్రి చిరంజీవికి ప్రకటించారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పరంగా తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు.

బన్నీ ఉత్సాహం

బన్నీ ఉత్సాహం

కాంగ్రెస్ పార్టీ తరుపున రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తుండటంతో బన్నీకూడా ఆయన వెంటే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి టాప్ స్టార్ల అండ

తెలుగుదేశం పార్టీకి టాప్ స్టార్ల అండ

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కేవలం నందమూరి ఫ్యామిలీ మాత్రం అండగా ఉండేది. ఇపుడు మెగ ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ ఈ పార్టీకి తన మద్దతు ఇచ్చారు. మరో వైపు మహేష్ బాబు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు.

పవన్-బాలయ్య-మహేష్ ఇమేజ్ ఆ పార్టీకి ప్లస్సే...

పవన్-బాలయ్య-మహేష్ ఇమేజ్ ఆ పార్టీకి ప్లస్సే...

పవన్ కళ్యాణ్, బాలయ్య, మహేష్ బాబు లాంటి వారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రటించడం ఆ పార్టీకి అన్ని విధాలా కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బాలయ్య గెలుపు ఖాయమేనా?

బాలయ్య గెలుపు ఖాయమేనా?

బాలయ్య తొలిసారిగా హిందూ పురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. హందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావడంతో ఆయన గెలుపు ఖాయమే అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X