చరణ్ రెవెన్యూ అంటే ఏమిటో చూపించాడు, ఎన్టీఆర్ వరుసగా.. తిడుతున్నవాళ్ళు కూడా!

Recommended Video

RRR Movie Launch : RRR movie beat Baahubali Collections : Tammareddy Bharadwaja | Filmibeat Telugu

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సోషల్ మీడియా వేదికగా సినీరాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. తమ్మారెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సమస్య వచ్చిన పరిష్కారం విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. తాజాగా తమ్మారెడ్డి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ పై తన అభిప్రాయాలు తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తప్పకుండా బాహుబలి రికార్డులు అధికమిస్తుందని అభిప్రాయపడ్డారు.

నన్ను తిడుతున్న వాళ్ళు కూడా

నన్ను తిడుతున్న వాళ్ళు కూడా

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. నేను పలు విషయాలపై నా అభిప్రాయాలు తెలియజేస్తున్నాను. నచ్చని వారు కొందరు దారుణంగా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారని తమ్మారెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు దేశం మొత్తం ఒక తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటోంది. నన్ను తిడుతున్న వారు కూడా రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాకుంటున్నారని తమ్మారెడ్డి అన్నారు.

ఎలా ఉంటుందో ఊహించుకోండి

ఎలా ఉంటుందో ఊహించుకోండి

బాహుబలి 2 తో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా రాజమౌళి చేశారు. ఇక రాంచరణ్ రంగస్థలం చిత్రంతో రెవెన్యూ అంటే ఏమిటో చూపించాడు. ఎన్టీఆర్ గత కొంతకాలంగా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తమ్మారెడ్డి అన్నారు.

 200 కోట్లు పక్కా

200 కోట్లు పక్కా

ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఆర్ఆర్ఆర్ పై నెలకొంటున్న అంచనాలని బట్టి ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10 వేల స్క్రీన్స్ లో విడుదలవుతుందని తమ్మారెడ్డి అంచనా వేశారు. ఈ చిత్రం తొలిరోజే 200 కోట్ల బిజినెస్ చేయడం ఖాయం అని అభిప్రాయ పడ్డారు. తొలివీకేండ్ లోనే ఈ చిత్రం 500 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

బాహుబలి రికార్డులు

బాహుబలి రికార్డులు

బాహుబలి రికార్డులని ఈ చిత్రం పూర్తిగా తుడిచిపెట్టేస్తుందా లేదా అనే విషయం విడుదలయ్యాకే క్లారిటీ వస్తుందని అన్నారు. కానీ నా అంచనా ప్రకారం బాహుబలి రికార్డులని అధికమిస్తుందనే భావిస్తున్నానని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

త్వరలో షూటింగ్

త్వరలో షూటింగ్

ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర తొలి షెడ్యూల్ కు అంతా సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నగర శివారులో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరగనుంది. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మగధీర, ఈగ, బాహుబలి చిత్రాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X