»   » అది కేవలం యాక్సిడెంటే అంటూ సల్మాన్ లాయన్ వాదన!

అది కేవలం యాక్సిడెంటే అంటూ సల్మాన్ లాయన్ వాదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ బెయిల్ పిటీషన్ మీద బాంబే హైకోర్టులో శుక్రవారం వాదనలు ప్రారంభం అయ్యాయి. సల్మాన్ తరుపు న్యాయవాది హరీష్ సాల్వే ఇతర కేసు వల్ల వీలు కాక పోవడంతో ఆయన తరుపున సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు.

ఆరోజు జరిగింది కేవలం యాక్సిడెంట్ మాత్రమే, మరణానికి కారణమయ్యాడనే అభియోగాలు సల్మాన్ మీద తొలగించాలి....సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలి అని అమిత్ దేశాయ్ జడ్జిని కోరారు. ఈ కేసులో సల్మాన్ తో పాటు కారులో ఉన్న కమాల్ ఖాన్ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదని అమిత్ దేశాయ్ వాదించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులున్నారు, వారంతా ప్రత్యక్ష సాక్షులే, దీనికి క్రింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని అమిత్ దేశాయ్ వాదించారు.

ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తామని కోర్టు వ్యాఖ్యనించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెలుతోందని సాక్షి చెబుతున్నాడని, అయితే హోటల్ నుండి సంఘటన స్థలానికి 14 కిలోమీటర్ల దూరం మాత్రమే. కానీ 30 నిమిషాల సమయం పట్టింది. సల్మాన్ ఖానే కారు నడుపుతున్నట్లు ఎవరూ నిరూపించలేక పోయారని అమిత్ దేశాయ్ వాదించారు. పోలీసులు అధికారుల ఇచ్చిన సాక్ష్యాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు.

Will Salman Khan get bail?

ఈ విచారణకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేదు. ఇంట్లోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విచారణకు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయమై ఆయన అభిమానులు,సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కేసు వివరాలు...
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దేషిగా తేల్చింది. ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి డి.డబ్ల్యు దేశ్ పాండే తీర్పు వెలువరించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందు మరో రెండు నెలలు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారు. జడ్జి తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ ఖాన్ మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేదు. తలదించుకుని ఉన్నారు.

కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది.

English summary
Will Salman Khan get bail or will the actor go to jail? Bombay high court will today decide his fate in the 2002 hit-and-run case in which he has been convicted and sentenced to jail for five years.
Please Wait while comments are loading...