బాలీవుడ్ లోనూ 'కిక్'
రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ చిత్రం ఇప్పుడు హిందీలోకి సైతం వెళ్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా ఈ చిత్రం రీమేక్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం రీమేక్ హక్కులను ఫాన్సీ రేటు ఇచ్చి సాజిద్ నడియాడ్‌వాలా పొందారు. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు స్వయంగా సురేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రానికీ రానంత ఫాన్సీ రేటు ఈ చిత్రానికి వచ్చిందని చెపుతున్నారు. మరోప్రక్క బెంగాలీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆయా భాషల నిర్మాతలు హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు.అలాగే ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను ఫాన్సీ ఆఫర్ ఇచ్చి ఎడిటర్ మోహన్ పొందారు. తన కుమారుడు రాజా దర్శకత్వంలో మరో కుమారుడు రవి హీరోగా ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్‌కి 'తిల్లాలంగడి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన పోకిరి రీమేక్ వాంటెడ్ ఇప్పుడు బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











