శక్తి సినిమాకి సంజీవని లాంటి వాడు జూ ఎన్టీఆర్
ఎక్కువ బడ్జెట్ సినిమాలు ప్రోడ్యూసర్స్‌కి ఎప్పుడైనా రిస్క్‌తో కూడుకున్న పనే. పద్దెనిమిది నెలలుగా నిద్రాహారాలు మానివేసి శక్తి సినిమాని రూపోందిస్తున్నామని శక్తి ఆడియో ఫంక్షన్‌లో అశ్విదత్ వెల్లడించడం జరిగింది. శక్తి సినిమా మొత్తం చూచుకున్నట్లైతే గనుక సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ జూ ఎన్టీఆర్ మాత్రమే. అది మాత్రమే కాకుండా ఈసినిమాని బాక్సాఫీసు రికార్డులకు తీసుకుపోవాలన్నా అశ్వినిదత్‌కు మరియు ఈ శక్తి సినిమాకి సంజీవని లాంటి వాడు మన జూ ఎన్టీఆర్.
శక్తి సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ విషయానికి వస్తే శక్తి సినిమాని ఓ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో జూ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తూ తయారు చేయడం జరిగింది. తను ఎంత బాగా ఐతే స్టోరీని తయారు చేశాడో అంతే విధంగా సినిమాని కూడా తీశాడన్నది శక్తి సినిమా ట్రైలర్స్ చూస్తే తెలిసిపోతుంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు మహేష్ పోకిరి రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత వచ్చినటువంటి రామ్ చరణ్ మగధీర ఆ రికార్డుల్ని తిరగరాసింది.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక చర్చ. టాలీవుడ్‌లో డెబై అయిదు సంవత్సరాలు చరిత్రను తిరగరాసినటువంటి మగధీర సినిమా రికార్డుల్ని శక్తి బద్దలు కోడుతుందా లేదా అనేది పెద్ద హాట్ టాపిక్. ఇప్పటికే ఈసినిమాపై యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ హైప్ క్రియేట్ చేయబడింది. ఇది మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో మగధీర సినిమా ఓ బెంచ్ మార్క్‌ని సృష్టించింది. ఆ బెంచ్ మార్క్‌ని శక్తి సినిమా దాటుతుందా లేదా అని తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు వేచిచూడాల్సిందే.
ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలయినటుంటి శక్తి సినిమా పాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమాని మార్చి 30వ తారీఖున విడుదల చేయడానికి నిర్మాత అశ్వినిదత్ సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











