twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రికార్డులను 'శ్రీరామ రాజ్యం' తిరగరాయగలదా?

    By Srikanya
    |

    1963లో విడుదలైన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న చిత్రం శ్రీరామ రాజ్యం. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం ఈ రోజు అంతటా విడుదలైంది. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన ఈ పౌరాణిక చిత్రం అఫ్పట్లో సంచలన విజయం సాధించింది. మొట్టమొదట ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ బానర్ పై దేవకీబోస్ 'లవకుశ' బెంగాలీలో తీశారు. అదే స్క్రిప్టుతో ఆ కంపెనీవారే తెలుగులో తీసే బాధ్యత సి.పుల్లయ్య కు అప్పగించారు. అప్పటి డ్రామా నటులైన పారుపల్లి సుబ్బారావు రామునిగా, శ్రీరంజని సీతగా 1934లో "లవకుశ" తెలుగు తెరకెక్కి బాగా విజయవంతమైనది. ఆ తర్వాత మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత,1963లో "లలితాశివజ్యోతి" బ్యానర్ పై ఇదే కధను కలర్స్ లో తీసి విడుదల చేసారు. అదీ ఘన విజయం సాధించి కళా ఖండంగా చరిత్రలో నిలిచిపోయింది.

    1934లో వచ్చిన లవకుశ 365 రోజులు ఆడగా ఈ లవకుశ 500 రోజులపాటు ప్రదర్శింపబడింది. ఇక శ్రీరామ రాజ్యం చిత్రం కూడా 'లవకుశ'కు రీమేక్‌గా వస్తూండటంతో చాలా మంది పౌరాణిక చిత్రాల అభిమామలు ఈ చిత్రాన్ని లవకుశతో పోల్చి చూస్తున్నారు. ఆ రేంజిలో సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం కథ రావణ సంహారం తరవాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన ఘట్టం నుంచి మొదలవుతుందీ చిత్రం. శ్రీరామ పట్టాభిషేకం, రాజధర్మం కోసం సీతను అడవులకు పంపడం, లవకుశుల జననం, రామగానం చేస్తూ ఆ సోదరులు అయోధ్యకు వెళ్లడం, ఆ తరవాత యాగాశ్వాన్ని బంధించి లక్ష్మణుడితోనూ, ఆ తరవాత రాముడితోనూ యుద్ధం చేయడం లాంటి ఘట్టాలతో ఈ చిత్రం సాగుతుంది.

    English summary
    Balakrishna's new film Sri Rama Rajyam releasing today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X