'బెల్లంకొండ సురేష్ పై కఠిన చర్యలు'
రామ్ హీరోగా కందిరీగ చిత్రం రూపొందించి హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్ రీసెంట్ గా అదే బ్యానర్ లో అదే హీరోతో మరో చిత్రం ప్రారంభించారు. అయితే సినిమాకు సంభందించి కథ సెకండాఫ్ లో కొంత మార్పులు చెయ్యాలని నిర్మాత ఈ దర్శకుడుకి సూచించారు. అయితే మార్పులు చేస్తే హీరోకి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ హీరో,నిర్మాత ఓకే చేసారు కదా అన్నారు. దీంతో గొంతు లేస్తోందేంటి అంటూ బెల్లంకొండ తనపై సీరియస్ అయ్యి చెయ్యి చేసుకున్నారు. ఈ మేరకు దర్శకుడు ఎపీ ఫిల్మ్ డైరక్టర్స్ అశోశియేషన్ లో కంప్లైంట్ చేసారు.
ఇక కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పై బెల్లంకొండ సురేష్ చెయ్యచేసుకోవటం అంతటా చర్చనీయాంమైంది. గతంలోనూ ప్రియమణి వంటి వారు ఇలా రెమ్యునేషన్ విషయంలో బెల్లంకొండతో గొడవలు జరిగాయని మీడియాలో వార్తలు సైతం వచ్చాయి. అంతేగాక సమంత డేట్స్ విషయంలోనూ బెల్లంకొండ ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి మరీ కంప్లైంట్ పెట్టి ఆమె డేట్స్ తెచ్చుకుని షూట్ చేస్తున్నారు. ఇక ఇంత వివాదం జరిగాక ఆ దర్శకుడు . బెల్లంకొండతో సినిమా చేస్తాడా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. ఈ విషయంలో రామ్ ఏ మాత్రం కలుగ చేసుకోవటానికి ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ ఈ చిత్రంతో పాటు సమంత,సిద్దార్ధ కాంబినేషన్ లో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే త్వరలో లారెన్స్ తోనూ ఓ చిత్రం మొదలు పెట్టనున్నారని సమాచారం. వెంకటేష్ తో రీసెంట్ గా చేసిన బాడీగార్డు నెగిటివ్ రిపోర్టు రావటంతో స్క్రిప్టు విషయంలో బెల్లంకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత ఖర్చు పెట్టినా స్క్రిప్టు సరిగా ఉండాలని ఆయన నమ్మి ముందుకు వెళ్లటంలో ఇలా కోపతాపాలకు లోనవటం జరుగుతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












