వైరల్ అవుతున్న అర్చన రొమాంటిక్ ఫోటోస్... అతడిని పెళ్లాడబోతోందా?

Recommended Video

Actress Archana Latest Pics || అర్చన అతడిని పెళ్లాడబోతోందా..?

టాలీవుడ్ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేం అర్చన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మీరు ఊహించింది నిజమే. త్వరలో ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది.

బిగ్ బాస్ షో తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అర్చన... తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు, త్వరలోనే ఆవిషయాన్ని బయటపెడతాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లకు ఆమె ఆ వ్యక్తి ఎవరో అఫీషియల్‌గా బయటపెట్టారు. ఆమె ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

త్వరలో ఒక గొప్ప న్యూస్ చెబుతాను

త్వరలో ఒక గొప్ప న్యూస్ చెబుతాను

‘‘త్వరలో మీకు ఒక గొప్ప న్యూస్ చెప్పబోతున్నాను. అప్పటి వరకు ఈ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటో తీసింది జయంతి.... విత్ మై లవ్ జగదీష్ భక్తవత్సలం'' అంటూ అర్చన కొన్ని ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఒక వ్యక్తి అర్చనను ప్రేమగా ముద్దాడుతున్నట్లు ఉండటం గమనించవచ్చు.

ఆమె చెప్పబోతున్న ఆ గుడ్ న్యూస్ ఏమిటి?

ఆమె చెప్పబోతున్న ఆ గుడ్ న్యూస్ ఏమిటి?

అర్చన ఇచ్చిన సంకేతాలను బట్టి, పోస్ట్ చేసిన ఫోటోలను బట్టి త్వరలో ఆమె తన పెళ్లి విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగదీష్ భక్తవత్సలంతో ఆమె ప్రేమలో ఉన్నట్లు, అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఊహానాగాలు వినిపిస్తున్నాయి.

కెరీర్ ముగిసింది, ఇక సెటిలవ్వడమే...

వర్క్ పరంగా చూస్తే అర్చన కెరీర్ ముగిసిందనే చెప్పాలి. 2004లో అల్లరి నరేష్ మూవీ ‘నేను' ద్వారా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా 2017లో వచ్చిన ‘ఫైనల్ ఎగ్జిట్' అనే హిందీ మూవీలో నటించింది. కెరీర్ ముగియడంతో జీవితంలో సెటిలవ్వాలని అర్చన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ షో ద్వారా వార్తల్లో...

బిగ్ బాస్ షో ద్వారా వార్తల్లో...

2017లో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్లో కంటెస్ట్ చేయడం ద్వారా కొంతకాలం పాటు అర్చన పేరు మారుమ్రోగిపోయిది. ఈ షోలో ఆమె దాదాపు చివరి వరకు కొనసాగారు. అయితే ఈ షో తర్వాత అర్చన కెరీర్ ముందుకు సాగుతుందని భావించారు కానీ అలాంటి మ్యాజిక్ ఏమీ జరుగలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X