హిందీ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటా: మిస్ ఇండియా వరల్డ్
ముంబై: అవకాశం లభిస్తే బాలీవుడ్ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటానని మిస్ ఇండియా వరల్డ్ అదితి ఆర్య అంటున్నారు. 21 ఏళ్ల అదితి ఆర్యా ఇటీవల మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని ఇటీవల దక్కించుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తన దృష్టి అంతా మిస్ వరల్డ్ కావడంపైనే ఉందని, అయితే బాలీవుడ్ నుంచి ఏమైనా అవకాశాలు వస్తే వదులుకోదలుచుకోలేదని ఆమె అన్నారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి తనకు ఉన్నట్లు తెలిపారు.
బిజినెస్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్న ఆమె - అయితే తన అంతిమ లక్ష్యం బాలీవుడ్‌లో నటించడం కాదని, తన ఉన్నత విద్యతో గ్లామర్ ప్రపంచాన్ని సమతుల్యం చేసుకుంటానని ఆమె అన్నారు.

తాను పూర్తి కాలం రీసెర్చ్ అనలిస్టుగా పనిచేస్తున్నాని, దాన్ని కొనసాగిస్తానని, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సెషన్స్ తీసుకుంటున్నానని, తాను ఎఁబిఎ చేయదలుచుకున్నానని ఆమె పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో అందాల పోటీలో పాల్గొన్నానని చెప్పారు. బాల్యంలో తాను మిస్ ఇండియాను అవుతానని అనుకోలేదని, అయితే, వివిధ వేదికలపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఉండేదని ఆమె అన్నారు. మోడల్ యునైటెడ్ నేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











