వేణుస్వామి అరెస్ట్? బిగ్‌బాస్ షోలోకి రాకుండా నాగార్జున చెక్!
సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటి వరకు ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడినా , సదరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో జస్ట్ ట్రోలింగ్‌తో, విమర్శలతో వదిలిపెట్టేసేవారు. ఎన్ని సార్లు చెప్పినా , కుక్కతోక వంకరే అన్నట్లుగా వ్యవహరిస్తున్న వేణుస్వామి మళ్లీ నోరెత్తకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య- శోభితాల జీవితాల్లో వేలు పెట్టడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పు. అత్యుత్సాహంతో వేణుస్వామి చేసిన పనికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఊహాగానాలకు తెరదించుతూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా ఈ వేడుక నిర్వహించారు. అక్కినేని అభిమానులు, ప్రముఖులు, అభిమానులు ఈ జంటను ఆశీర్వదించి.. విషెస్ తెలియజేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న వారిని ఏ బ్రాహ్మణుడైనా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. కానీ అందుకు విరుద్ధంగా వేణుస్వామి వ్యవహరించారు.

ఎంగేజ్‌మెంట్ జరిగి జస్ట్ గంటలు గడవకముందే.. నేను ఇప్పుడే చైతూ- శోభితల జాతకం చూశాను, అస్సలు బాలేదు.. నిశ్చితార్ధం జరిగిన టైం కరెక్ట్ కాదని , ఓ అమ్మాయి కారణంగా వీరు కొద్దినెలల్లోనే విడిపోతారంటూ వేణుస్వామి వీడియో పెట్టాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది.. శుభమా అని తమ హీరో పెళ్లి చేసుకోబోతుంటే ఆ అపశకునం మాటలేంటీ అంటూ ట్రోలింగ్‌కు దిగారు. ఈ దెబ్బకు దిగొచ్చిన వేణుస్వామి.. గతంలో సమంత- నాగచైతన్యల ఎపిసోడ్‌కు కొనసాగింపుగానే ఈ జాతకం చెప్పానని.. సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ విశ్లేషణలు చేయననే మాటకు కట్టుబడి ఉంటానని వివరణ ఇచ్చాడు.
అయితే తెలుగు ఫిలిం జర్నలిస్టులు, డిజిటల్ మీడియా యూనియన్లు వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమీషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడంతో పాటు 22వ తేదీన వ్యక్తిగతం హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఈ వేణుస్వామి బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లాలని చూస్తున్నాడట. కంటెస్టెంట్స్ లిస్ట్‌లో అతని పేరు ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. చైతన్య ఎపిసోడ్‌తో బిగ్‌బాస్‌లోకి ఆ స్వామిని తీసుకోవద్దని నాగార్జునను అభిమానులు కోరుతున్నారు.
కొద్దిరోజుల క్రితం 30 , 40 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను పిలిచి వారికి లావిష్ పార్టీ, కొంత డబ్బు ముట్టజెప్పి బిగ్‌బాస్‌లో తనకు ఓట్లు పడేలా , క్యాంపెయినింగ్ చేసిపెట్టమని కోరాడట. అయితే స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వేణుస్వామికి బిగ్‌బాస్ డోర్స్ క్లోజ్ అయిపోయినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటిదాకా వేణుస్వామి చేసిన పాపాలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు, దొంగ జోస్యాలకు ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన బాధితులు కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండటంతో వేణుస్వామి అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహిళా కమీషన్‌కి ఆయన ఇచ్చే వివరణను బట్టి పోలీసుల రియాక్షన్ ఉంటుందని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











