Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రూ. 1000 సాయంతో... ‘నా పేరు సూర్య’ జీప్ గెలుచుకునే ఛాన్స్!
Recommended Video
కేరళ వరద బాధితులకు సహాయం చేసేందుకు వివిధ మార్గాల్లో పలు సంస్థలు విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నా పేరు సూర్య' చిత్ర బృందం కేరళ బాధితులను ఆదుకునేందుకు వినూత్నమైన కాంటెస్ట్‌కు శ్రీకారం చుట్టింది. కేరళ బాధితులకు రూ. 1000 సహాయం చేయడం ద్వారా ఈ చిత్రంలో హీరో ఉపయోగించిన జీప్ గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ కాస్టెంటులో పాల్గొనాలనుకునే వారు https://www.starobe.com/naaperusurya సందర్శించి కేరళ సహాయ నిధికి కనీసం రూ. 1000 విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అలా డొనేట్ చేసిన వారిలో లక్కీ విన్నర్స్‌ను ఎంపిక చేసి వారికి జీప్ బహూకరించనున్నారు. రూ. 1000 ఎన్ని ఎక్కువ సార్లు డొనేట్ చేస్తే జీప్ గెలుచుకునే ఛాన్స్ అంత ఎక్కువగా ఉంటుందని కాంటెస్ట్ నిర్వాహకులు తెలిపారు.
విరాళం అందించిన వారికి కాంప్లిమెంటరీ గిఫ్టుగా నా పేరు సూర్యలో అల్లు అర్జున్ ధరించిన టీ షర్టు పంపించనున్నారు. దీంతో పాటు పది మంది లక్కీ విన్నర్స్‌కు నా పేరు సూర్య టీంను కలిసే అవకాశం కల్పించనున్నారు.
మహింద్రా కంపెనీకి చెందిన థార్ జీప్‌ను 'నా పేరు సూర్య' సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. 2.5 లీటర్స్ సిడిఆర్ఇ ఇంజిన్ కలిగిన ఈ స్టోర్ట్స్ జీప్ 105 హార్స్ ఫవర్, 247ఎన్ఎం టార్క్ శక్తిని కలిగి ఉంది. ఆరు చక్రాలతో ఆఫ్ రోడ్ లో కూడా దూసుకెళ్లే విధంగా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేవారు.