బ్యాంకాక్ లో ఎంజాయ్ చేయాలనుంటే...కళ్యాణ్ రామ్
సొంత బ్యానర్ పై తీసిన జయీభవ చిత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో హీరో కళ్యాణ్ రామ్ ప్రమోషన్ కోసం ఓ స్కీమ్ పెట్టాడు. జయీభవ చూడండి..బ్యాంకాక్ లో ఎంజాయ్ చేయండి అని. ఈ సినిమా చూసి ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న వారిలో ఐదు జంటలను ఎంపికచేసి ఈ అవకాశం కల్పిస్తానంటున్నాడు. అక్కడ పూర్తి స్ధాయి ఎంజాయ్ గ్యారెంటీ అంటున్నాడు. సాధారణంగా ఇలాంటి కాంటెస్ట్ లు సినిమా కష్టమనుకున్నప్పుడు పెడతారు. అయితే ఈ చిత్రం జాతకం అర్ధమయ్యే వారం కూడా కాకుండేనే కళ్యాణ్ రామ్ ఈ దారిలోకి వచ్చాడని ఫిల్మ్ వర్గాలు అంటున్నారు. నూతన దర్శకుడు నరేన్ కొండేపాటిని పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో కథ,కథనాలే సమస్యగా మారటం జరిగింది. రెడీ తరహా కామెడీ మార్గంలోకి వెళ్లాలని కళ్యాణరామ్ ఆశించి చేసిన ఈ ప్రయత్నం నీరుగార్చింది. ఏదైమైనా బ్యాంకాక్ లో ఫుల్ ఎంజాయ్ మెంట్ ఉంటుందని తెలుసుకున్న కళ్యాణ్ రామ్ తన అభిమానులకు కూడా దాన్ని అందించాలను కోవటం సంతోషమే.


Click it and Unblock the Notifications











