2017లో తనకు జరిగిన మంచి... చెడును గుర్తు చేసుకున్న నాగార్జున!
2017 సంవత్సరానికి వీడ్కోలు పలికి ఈ రోజు అందరూ 2018వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. గతేడాది ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా సాగింది. ఆ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి ఎంటరయ్యారు.
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా 2017 సంవత్సరంలో తనకు ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుంటూ 2018లో అడుగు పెట్టారు. 2017 జ్ఞాపకాలన్నింటినీ ఒక ఫోటో రూపంలో పొందు పరిచి ట్వీట్ చేశారు. 2018 సంవత్సరంలో అందరికీ శుభం కలుగాలని ఆకాంక్షించారు.

నిర్మాతగా రెండు విజయాలు
2017లో నాగార్జున రెండు సినిమాలు నిర్మించారు. అందులో ఒకటి తన పెద్ద కుమారుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘రారండోయ్ వేడుక చూద్దాం', రెండో మూవీ అఖిల్ హీరోగా నటించిన ‘హలో'. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం
2017 నవంబర్లో నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అదృష్ట వశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కొంత మేర ఆస్థినష్టం సంభవించింది.

అఖిల్ ఎంగేజ్మెంట్ రద్దు
2016 చివర్లో నాగార్జున కుమారుడు అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రీయ భూపాల్ తో జరిగిన సంగతి తెలిసిందే. 2017లో కొన్ని కారణాల వల్ల ఈ ఎంగేజ్మెంట్ రద్దయింది. దీని వల్ల అఖిల్ కు మంచే జరిగిందని, లేకుంటే ఈ చిన్న వయసులోనే సంసార సాగరంలో ఇరుక్కుని ఉండేవాడని అప్పట్లో చర్చించుకున్నారు.

నాగ చైతన్య ఎంగేజ్మెంట్, వివాహం
2017 నాగార్జున కుటుంబంలో జరిగిన అత్యంత సంతోషకరమైన వేడుక..... నాగ చైతన్య-సమంత వివాహం. 2017 ప్రారంభంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏడాది చివర్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

రాజుగారి 2 గది హిట్
2017లో నాగార్జు, ఆయన కోడలు సమంత కలిసి ‘రాజుగారి గది 2' చిత్రంలో నటించగా...బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కోడలు రాకతో పాటు ఒక సినిమా విజయాన్ని కూడా తెచ్చిందని నాగార్జున చాలా సంతోషించాడు.

అఖిల్ హీరోగా స్టాండ్ అయ్యాడు
తన చిన్న కుమారుడు అఖిల్‌ను రీ లాంచ్ చేస్తూ నాగార్జున తెరకెక్కించిన ‘హలో' మూవీ 2017 చివర్లో విడుదలై మంచి విజయం అందుకుంది. నాగ చైతన్య పెళ్లి తర్వాత నాగార్జునను బాగా సంతోష పడ్డ అంశం ‘హలో' విజయమే.

వర్మతో సినిమా
చాలా కాలం తర్వాత తనకు ‘శివ' లాంటి హిట్ అందించిన రామ్ గోపాల్ వర్మతో 2017లో నాగార్జున ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











