twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ ఫీల్డ్ లో ఎక్కువ కాలం నిలబడాలంటే అది తప్పని సరి: త్రిష

    By Sindhu
    |

    సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ త్రిష బాగా వంటబట్టించుకున్నట్టుంది. ఈ వయ్యారికి రోజు రోజుకీ వయసు పెరుగుతున్నా మరింతగా ద్విగుణీకృత అందంతో కనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'బాడీగార్డ్" చిత్రంలోనూ అలాగే జూ. ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దమ్ము" చిత్రంలోనూ త్రిష నటిస్తోంది.

    పవన్‌ కళ్యాణ్‌తో నటించిన 'తీన్‌ మాన్" చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన త్రిష ప్రస్తుతం ఆ చిత్రానికి భిన్నంగా మరింత గ్లామర్‌ గా తదుపరి చిత్రాల్లో కనిపించనుందట. తన గ్లామర్ రహస్యం గురించి త్రిష మాట్లాడుతూ 'సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో ఎక్కువ కాలం రాణించాలంటే ఒకటి లక్ వుండాలి లేదా గ్లామరైనా వుండాలి. ఓ నటిగా కావాల్సిన అర్హతలు అన్నీవున్నా ఈ రెండింటిలో ముఖ్యంగా గ్లామర్‌ లేకపోతే ఈ ఫీల్డ్‌లో ఎక్కువ కాలం నిలబడటం కష్టమే. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ గ్లామర్‌ గా వుండటానికే అధిక ప్రాధాన్యతనిస్తా" అంటోంది.

    English summary
    Its a fact from the day cine industry entered India, that females do very glamorous roles wearing sexy costumes for Telugu movies whereas they cover their entire body for Tamil. Same applies to Trisha. She has shown her whole heartedly in Telugu movies, whereas she has always opted for character roles in Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X