ప్రేమ పెళ్ళి చేసుకోబోతున్నా మరో యంగ్ టాలీవుడ్ లవర్ బాయ్...!?
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం 'కందిరీగ' సినిమాలో నటిస్తున్న యువ కథానాయకుడు రామ్ త్వరలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ తెలుగు, తమిళ చిత్రాన్నీ, కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమానీ చేయనున్నాడు. ఇదిలా ఉంచితే, ఈ 'దేవదాసు' కుర్రాడు ప్రేమలో పడ్డాడా? ఈ ప్రశ్నకు టాలీవుడ్ లో అవుననే అంటున్నారు చాలామంది. ఎందుకంటే, మే 15 తన బర్త్ డే సందర్భంగా మీడియాకిచ్చిన అన్ని ఇంటర్వ్యులలోనూ అతని పెళ్లి ప్రస్తావనే వచ్చింది. కావాలనే జర్నలిస్టులచేత అతని పిఆర్వో పెళ్లికి సంబంధించిన ప్రశ్న అడిగించాడట. దానికి రామ్ సమాధానమేమిటంటే, 'తప్పకుండా నేను లవ్ మేరేజే చేసుకుంటాను. ఆ విషయంలో పెద్దలను ఒప్పించే చేసుకుంటాను. అయితే, ఇంకా ఎవరి ప్రేమలోనూ మాత్రం పడలేదు' అన్నది ఈ కుర్రాడి జవాబు.
అయితే, టాలీవుడ్ జనం మాత్రం దీనిని మరోలా అర్ధం చేసుకుంటున్నారు. 'ఎవరి ప్రేమలోనో రామ్ పడ్డాడు. అందుకే, లవ్ మేరేజే చేసుకుంటానని చెబుతున్నాడు. ఒకవేళ ప్రేమా గీమా లేకపోతే సంప్రదాయ కుటుంబానికి చెందిన రామ్ ప్రేమ వివాహమే చేసుకుంటానని ఎందుకు చెబుతాడు?' అన్నది వారి వాదన. తన కుటుంబ సభ్యులతో బాటు అందర్నీ ఇలా ఇప్పటి నుంచే అందుకు ప్రిపేర్ చేస్తున్నాడని వీరు అంటున్నారు. ఏదైనా, త్వరలోనే అతని ప్రేమ కథ తెలుస్తుందిలెండి!


Click it and Unblock the Notifications











