స్టార్ హీరోలు లేకుంటే వీళ్ళంతా వేస్టే!
ఇలియానా, హన్సిక, కాజల్, వీళ్లంతా క్రేజ్ ఉన్న అందమైభామలే. సరయిన సినిమా పడితే తమ గ్లామర్, అభినయంతో దానికి మరింత ఆకర్షణ జోడించగలరు. అయితే వీరికి స్టార్ హీరోల అండ లేకపోతే హిట్టు కొట్టడం కష్టమని మళ్లీ మళ్లీ తేలిపోతోంది. పవన్, రవితేజ వంటి హీరోలతో కిక్ ఇచ్చి జల్సా చేసిన ఇలియానా..స్టార్ ఇమేజ్ లేని నితిన్, తరుణ్, విష్ణులతో చతికిలపడింది. కాజల్ కూడా స్టార్స్ తో చేసినప్పుడే విజయాలు సాధించింది కానీ ఇతర కుర్రాళ్లతో చేసినప్పుడు ఫ్లాపయింది.
హన్సిక సైతం నితిన్ సరసన సత్తా చూపించలేక చేతులెత్తేసింది. ఛార్మి, అనుష్క వంటి హీరోయిన్లు సోలోగా హిట్లు సాధించిన ఘనత వహించారు కానీ, ఛార్మి మంత్రం ఒక్క సినిమాకే వర్క్అవుట్ అయింది. అనుష్క సంగతి 'పంచాక్షరి"తో తెలిసిపోతుంది. ఏదేమైనా కోటికి పడగలెత్తుతోన్న మన హీరోయిన్లు పక్కన కోట్లు కొల్లగొట్టే హీరోలు లేకుంటే మాత్రం పుచ్చుకున్న పైకానికి న్యాయం చేయలేక నిర్మాతల జేబులకి చిల్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











