సల్మాన్ కోసం మహిళ ఆత్మహత్యాయత్నం
సల్మాన్ ఖాన్-కరీనా కపూర్ జంటగా నటించిన 'బాడీగార్డ్" సినిమా సూపర్ హిట్ టాక్ తో కళ్లు చెదిరే కలెక్షన్లు వసూలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కొన్ని చోట్లు ఈ సినిమా హౌస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ విషయం ఇలా ఉంటే...సల్మాన్ కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
అహ్మదాబాద్ కు చెందిన 26 ఏళ్ల ఓ మహిళ...భర్త తనను బాడీగార్డు సినిమా తీసుకుపోలేదనే కోపంతో ఆత్మహత్య యత్నం చేసింది. ఆమె పేరు అంజన. భర్త పేరు అమిత్. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. కథ్‌వాడలోని మురళీధర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. భార్య భర్తల మధ్య కలహాలు సాధారణమే. అయితే ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం, పైగా సల్మాన్ సినిమా కోసం ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆత్మహత్య చేసుకున్న సదరు మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ప్రాణానికి ఎలాంటి హానీ లేదని వైద్యలు తెలిపారు.


Click it and Unblock the Notifications











