యూట్యూబ్ సెన్సేషన్ విలేజ్ సింగర్ బేబీపై కేసు
యూట్యూబ్ సెన్సేషన్, విలేజ్ సింగర్ బేబీ ఓ వైపు తన సింగింగ్ టాలెంటుతో అందరి మన్ననలు పొందుతూ మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురి ప్రశంసలు అందుకుంటూ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆమెపై ఓ కేసు నమెదు కావడం చర్చనీయాంశం అయింది.
సింగర్ బేబీ... తన భర్తను ఆమె భర్తగా చెప్పుకుంటోందంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో పసల ఉషారి కుమారి అనే మహిళ కేసు పెట్టింది. పసల వజ్రరావుతో తనకు 20 ఏళ్ల క్రితం పెళ్లయిందని, ఇద్దరు పిల్లు కూడా ఉన్నారని ఉషాకుమారి తెలిపారు.

నా భర్తతో కలిసి తిరుగుతూ...
బేబీ తన భర్త వజ్ర రావుతో కలిసి తిరుగుతూ ఆమె భర్తగా అందరికీ పరిచయం చేస్తోందని ఉషాకుమారి ఆగ్రహంగా ఉన్నారు. విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో కలిసి ఉంటూ భార్య పిల్లలను వజ్రరావు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నాకు న్యాయం చేయండి
తనకు సరైన న్యాయం చేయాలని, న్యాయం జరుగక పోతే ఆందోళనకు దిగుతానని ఉషాకుమారి హెచ్చరించింది. గతంలోనే కేసులు పెట్టిన ఎవరూ పట్టించుకోదని ఉషాకుమారి తెలిపారు.

నాతో పెళ్లయింది, ఆవిడతో కాలేదు
వజ్రరావుతో తను 20 ఏళ్ల క్రితం పెళ్లయిందని, కానీ అతడు సింగర్ బేబీ అనే ఆవిడతో ఉంటూ తనను బాధ పెడుతున్నాడని, పిల్లలు కూడా బాధ పడుతున్నారని ఉషా కుమారి తెలిపారు. పెళ్లి కాకుండా నా భర్తను ఆమె భర్తగా చెప్పుకోవడం తప్పని ఉషా కుమారి మండిపడ్డారు.

బేబీ ఎలా స్పందిస్తారో?
అయితే ఉషా కుమారి ఆరోపణలపై విలేజ్ సింగర్ బేబీ స్పందించాల్సి ఉంది. కాగా... సింగర్ బేబీ టాలెంటుకు ముగ్దులైపోయిన టాలీవుడ్ సంగీత దర్శకులు ఆమెకు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











