»   » అచ్చం సినిమా కథ లాగే : కంగన "క్వీన్" లాగే భర్త లేని హనీ మూన్ కి వెళ్ళొచ్చింది. (ఫొటో స్టోరీ )

అచ్చం సినిమా కథ లాగే : కంగన "క్వీన్" లాగే భర్త లేని హనీ మూన్ కి వెళ్ళొచ్చింది. (ఫొటో స్టోరీ )

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ 'క్వీన్' గుర్తుందా! ఆ సినిమాలో ఒంటరిగా హనీమూన్ కి వెళ్లే యువతిగా కంగనా రనౌత్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు క్వీన్ లాంటిదే ఓ మహిళ నిజజీవిత గాథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.పాపం ఈ అమ్మాయి జీవితం కూడా సినిమా అయ్యింది. హనీమూన్ కాస్తా వాళ్ళాయన తో కాకుండా అత్తమామలతో వెళ్ళాల్సొచ్చిందన్న మాట... అదెంటీ అంటే అదంతే మరి. భార్యా భర్తల ప్రేమ గ్రీస్ ఎంబసీ వాళ్ళకి అర్థం కాలేదు మరి హూమా వాళ్ళాయన వీసా రెజెక్ట్ చేసి హూమాకి మాత్రం వీసా ఇచ్చేసారు....

పాపం ఇంకేం చేస్తుందీ భర్త లేని "ఒంటరి హనీమూన్" కి వెళ్ళొచ్చింది. అయితే ఆ ఙ్ఞాపకాలని మాత్రం మిస్సవకుండా. ప్రతీ క్షణం తను తన భర్తని ఎంత మిస్సవుతుందో అన్ని ఫొటోలు తీసి పెట్టింది వాటిని కాస్తా నెట్ కి ఎక్కించటం తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది వీళ్ళ "సింగిల్ హనీమూన్" భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లిన హుమా.. వాళ్లాయన లేని లోటును ఫీలవుతూ దిగిన ఫొటోలు ఫొటోలు వైరల్ అయ్యాయి.

పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన హుమా, అర్సలాన్ దంపతులు తమ రెండో హనీమూన్ కోసం చారిత్రక గ్రీస్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కూడా అత్తమామల్ని కూడా తీసుకెళ్లాలనుకున్నారు. అయితే గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో కథ 'క్వీన్' తరహా మలుపు తిరిగింది. అత్తమామలు కూడా ఉన్నప్పటికీ ప్రియమైన భర్త తోడు లేని లోటును ప్రతిక్షణం ఫీలవుతూ హుమా పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు దిగింది.

క్వీన్ లాగానే:

క్వీన్ లాగానే:

ఇక ‘క్వీన్‌'లో పెళ్లికావాల్సిన సమయంలో వరుడు మోసగించడంతో ఒంటరిగానే హానీమూన్‌కు పారిస్‌ వెళ్లిన రాణీ మెహ్రా పాత్రలో కంగన ప్రదర్శించిన నటన సినీ ప్రియులనందరినీ ఆకట్టుకుంది. విమర్శకులైతే ఆమె అభినయానికి ఫిదా అయిపోయారు. వికాస్‌ బెహల్‌ రూపొందించిన ఈ చిత్రం ఉత్తమ హిందీ చిత్రంగానూ అవార్డు గెలుచుకుంది.

సింగిల్ హనీమూన్ :

సింగిల్ హనీమూన్ :

పెళ్లికి ముందు రోజు వివాహం ఆగిపోతే.. ముందుగా హనీమూన్ కోసం బుక్ చేయించుకున్నటికెట్లపై వెకేషన్‌కి వెళ్లిన అమ్మాయి కథే ఈ క్వీన్. పారిస్ టూర్‌లో ఆమె ఎదుర్కున్న పరిస్థితులు తనలో వచ్చే మార్పు, కొత్త పరిచయాలు ఆ తర్వాత పెళ్లిని రద్దు చేసిన వ్యక్తి వచ్చి క్షమించమని అడగడం హీరోయిన్ తిరస్కరించడం..ఇదీ సినిమా కథ.

పాకిస్థాన్ :

పాకిస్థాన్ :

అయితే పాకిస్థాన్ కి చెందిన హుమా అనే అమ్మాయి విషయం లో పెళ్ళి రద్దు కావటం లాంటిదేమీ లేదు. అయినా ఆమె మాత్రం ఒంటరిగానే హనీ మూన్ కి వెళ్ళాల్సి వచ్చింది.

వాళ్ళాయన వీసా రెజెక్ట్ :

వాళ్ళాయన వీసా రెజెక్ట్ :

అదెంటీ అంటే అదంతే మరి. భార్యా భర్తల ప్రేమ గ్రీస్ ఎంబసీ వాళ్ళకి అర్థం కాలేదు మరి హూమా వాళ్ళాయన వీసా రెజెక్ట్ చేసి హూమాకి.., ఆమె అత్తా మామలకీ మాత్రం వీసా ఇచ్చేసారు....

రెండో హనీ మూన్:

రెండో హనీ మూన్:

హుమా, అర్సలాన్ దంపతులు తమ రెండో హనీమూన్ కోసం చారిత్రక గ్రీస్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కూడా అత్తమామల్ని కూడా తీసుకెళ్లాలనుకున్నారు. అయితే గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో కథ 'క్వీన్' తరహా మలుపు తిరిగింది.

ఒంటరి హనీమూన్:

ఒంటరి హనీమూన్:

పాపం ఇంకేం చేస్తుందీ భర్త లేని "ఒంటరి హనీమూన్" కి వెళ్ళొచ్చింది. అయితే ఆ ఙ్ఞాపకాలని మాత్రం మిస్సవకుండా. ప్రతీ క్షణం తను తన భర్తని ఎంత మిస్సవుతుందో అన్ని ఫొటోలు తీసి పెట్టింది వాటిని కాస్తా నెట్ కి ఎక్కించటం తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది వీళ్ళ "సింగిల్ హనీమూన్"

భర్త పక్కనే ఉన్నట్టు గా:

భర్త పక్కనే ఉన్నట్టు గా:

తాను వెళ్ళిన ప్రతీ ప్రదేశం లోనూ తన భర్త పక్కనే ఉన్నట్టు గా భుజం మీద చేయి వేసుకున్నట్టూ ఫొటోలు దిగింది.

మంచి ఙ్ఞాపకాలు:

మంచి ఙ్ఞాపకాలు:

భర్త లేని హనీమూన్ ఎంత "నరకమో" మనకు చెప్పాల్సిన పని లేదు కదా. పాపం హుమా మాత్రం ఆ అనుభవాన్ని కూడా మంచి ఙ్ఞాపకాలు గా మార్చుకుంది.

సినిమాలంటి జీవితాలూ:

సినిమాలంటి జీవితాలూ:

సినిమాలు జీవితాల్లోనిచి వస్తాయని తెలుసుగానీ... సినిమాలంటి జీవితాలూ ఉంటాయనిపించటం లేదూ... పాపం ఒంటరి హనీమూన్ అంటే ఎవరికైనా భాదే కదా...

కంగన కి తెలిస్తే? :

కంగన కి తెలిస్తే? :

ఇంతకీ ఈ విశయం కంగనాకు తెలుసో లేదో గానీ.... హుమా, అర్సలాన్ లు ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం తో విపరీతమైన స్పందన మాత్రం వస్తోంది... ఇంతకీ వాళ్ళు కూడా క్వీన్ సినిమా ని చూసారో లేదో.... ఇప్పుడు చూస్తే మాత్రం థ్రిల్లైపోతారు మరి.

English summary
A newly wed and her husband planned to enjoy their honeymoon in Greece but she goes alone as her new spouse is denied visa.Huma Mobin and her new husband Arsalaan Sever Bhatt, from Lahore, were scheduled to go on a second honeymoon to Greece last month with Mr Bhatt's parents.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu