తాగుబోతు మహిళలపై...స్టార్ హీరో కామెంట్స్
'భారత దేశంలో చాలా సంక్లిష్టంగా మారిన సమస్యలో....పలు మోడర్న్ సమస్యలు ఉన్నాయి. అందులో మద్యపానం కూడా ఒకటి. పాశ్చాత్య పోకడల కారణంగా మహిళలు కూడా మద్యానికి బానిసవుతున్నారు' అని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆల్కహాలిక్స్ అనోనిమస్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసారు.
'మహిళలకు తాగుడు అవాటు ఉన్నా...తాగుడుకి బానిసై సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారు తప్పని సరిగా బయటి వెళ్లాల్సి వస్తే ఎవరి సహాయమైనా తీసుకుంటే మంచింది' అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో మద్యానికి బానిసైన వారి ఉదంతాలను, దాని నుంచి వారు ఎలా బయట పడ్డారు అనే విషయాలు చూపెట్టారు. అయితే ఈ కార్యక్రమంలో మహిళా తాగుబోతుల అంశాన్ని మాత్ర టచ్ చేయలేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో ప్రారంభం అయ్యే 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












