»   » సినీ పరిశ్రమలో దుర్మార్గులున్నారు : కంగనా రనౌత్

సినీ పరిశ్రమలో దుర్మార్గులున్నారు : కంగనా రనౌత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో రైజింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ తనకు సినీ పరిశ్రమలో ఎదురైన సంఘటనలు ఎప్పటికీ మరిచిపోలేను అంటోంది. ఇక్కడ మహిళలను వక్రబుద్దితో చూస్తారు, నీచంగా ఆలోచిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. మహిళల పట్ల సినీ పరిశ్రమలో అలాంటి ఆటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

‘నేను సినిమా పరిశ్రమలో స్ట్రగుల్ అవుతున్న సమయంలో కొందరు నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేసారు. హీరోయిన్లు ఎప్పుడూ నిర్మాత మీద లేదా, హీరోపై ఆధారపడి ఉంటారని కొందరు భావిస్తుంటారు. సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు మహిళల పట్ల ప్రవర్తించే తీరు సిగ్గుచేటుగా ఉంటుంది. మహిళల పట్ల చులకన భావం పోవాలి. మార్పు రావాల్సిన అవసరం ఉంది' అంటూ కంగనా రనౌత్ పిటిఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

లోపల ఒక రకంగా, బయటకి ఒక రకంగా ఉంటే వ్యక్తులు అంటే నాకు నచ్చదు. అలా ఉండే వారి ప్రవర్తన నాన్ సెన్స్ గా ఉంటుంది. ఇలాంటి వారికి నేను వీలైనంత దూరంగా ఉంటాను. మహిళలు తమకు అవమానకర పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా బయట పెట్టాలి అని కంగనా రనౌత్ అన్నారు.

Women are treated badly in the industry: Kangana Ranaut

ప్రస్తుతం ‘కట్టి బట్టి' సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్...... నాలాగే మహిళ అందరూ పరిస్థితుల్లో మార్పు తేవడానికి ముందుకు రావాలి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి. ఎవరి సహాయం లేకుండా ఎదిగే ప్రయత్నం చేయాలి అని అన్నారు.

సినిమా పరిశ్రమలో ఎదగాలనుకునే మహిళలు..బాయ్ ఫ్రెండ్ లేదా ఫాదర్....లేదా ఎవరో ఒక అండ తప్పనిసరి అవుతోంది. లేకుంటే దుర్మార్గుల్లాంటి వ్యక్తులు చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో సొంతగా ఎదగడం చాలా కష్టం అంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.

English summary
"When I was struggling people treated me so badly. What happens is a heroine is always dependent on the producer or the hero so no one thought what if someone becomes Kangana Ranaut and then she will never work with me as producer or actor. They should have some shame before they treat women badly. They assume 'kya karegi'. She is just a girl," Kangana told PTI in an interview.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu