రూ. 4 కోట్లు ఇవ్వాల్సిందే.... నాగార్జున ఇంటి వద్ద యువతి వీరంగం!
Recommended Video

ఫిల్మ్ స్టార్ నాగార్జున ఇంటి వద్ద యువతి మంగళవారం రాత్రి వీరంగం సృష్టించడం చర్చనీయాంశం అయింది. రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున నివాసం వద్దకు వచ్చిన యువతి ఆయన తనకు రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఆయన్ను కలవడానికి లోనికి పంపాలంటూ హడావుడి చేసింది. నాగార్జున ఇంట్లో లేరని, తర్వాత రావాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా ఆమె వినిపించుకోకుండా రోడ్డు మీద పెద్ద గొడవ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

యువతి చెప్పిన మాటలతో అంతా షాక్
నాగార్జున పీఏను కలిసి తాను నాగార్జునను కలవాలని సదరు యువతి కోరగా... ఆయన్ను కలవాల్సిన కారణం ఏమిటని అడగారు. నాగార్జున తనకు రూ. 4 కోట్లు ఇవ్వాలని అందుకే వచ్చినట్టు ఆమె చెప్పడంతో అంతా షాకయ్యారు. నాగార్జున లేరని చెప్పినా ఆమె వినిపించుకోకుండా హడావిడి చేసింది.

యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎందుకలా చేసింది?
యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మానసిక స్థితి బాగాలేదని నిర్దారణకు వచ్చిన తర్వాత బంధువులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం.

నాగార్జున బిజీ బిజీ
ప్రస్తుతం నాగార్జున శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫన్ అండ్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని కూడా నటిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ చిత్రానికి ‘దేవదాసు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications










