మోహన్ బాబూ..నీ బద్మాష్ మాటలు బంద్ చేయి
మోహన్ బాబు బద్మాష్ మాటలు బంద్ చేయి, తెలంగాణ ఆత్మాభిమానాలను గౌరవించేలా మాట్లాడు, తెలంగాణకు ఎవరువ్యతిరేకంగా మాట్లాడినా మహిళలు తరిమికొడతారని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఆమె సోమవారం లక్సెట్టిపేట జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుని ఉద్దేశించి ఆమె పై విధంగా మాట్లాడారు.
అలాగే మోహన్ బాబు మాట్లాడిన మాటలు మహిళలను కిం చపరిచే విధంగా చేతులకు గాజులు తొడుకున్నామా అంటే మహిళలు అంత చులకనా, తెలంగాణ మహిళ ఐలమ్మ రజాకారులను తరిమికొట్టిందని గుర్తుంచుకోవాలని తెలిపారామె. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మహిళా లోకం తరిమికొడుతామన్నారు.పల్లె పల్లెన తెలంగాణ అంటుకున్నదంటూ ఉద్వేగంగా అన్నారు.
మన 10 జిల్లాల్లో 19 మంది ఎంపీలు రాజీనామా చేస్తే యూపీఏ సర్కార్ కూలుతుందని తెలంగాణ ఏర్పాటుఅవుతుందని, ఏదో తేల్చుకోవాలని నాయకులకు సవాల్ విసిరింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో ధూంధాం కళాకారులు, జేఏసీ నాయకులు, అన్ని కులసంఘాలు, మహిళలు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











