twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల ఎలాంటోడు? శ్రీరెడ్డి ఆరోపణల్లో నిజమెంత? అసోసియేట్ చైతన్య ఏమన్నారంటే..

    |

    Recommended Video

    Women Lyricist Chaitanya About Shekar Kammula,Sri Reddy Controversy || Filmibeat Telugu

    కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో గతేడాది శ్రీరెడ్డి పలువురు ఫిల్మ్ మేకర్స్ మీద, యాక్టర్ల మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శేఖర్ కమ్ములను ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై వెంటనే శేఖర్ కమ్ముల కూడా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వివరణ ఇచ్చారు.

    కమ్ముల వద్ద చాలా సినిమాకు పని చేసిన మహిళా రచయిత, యాక్టివిస్ట్ పింగళి చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వివాదంపై స్పందించారు. ఆ సమయంలో శ్రీరెడ్డి ఆరోపణలు చేసినప్పటికీ తర్వాత అవి తప్పు అని రియలైజ్ అయ్యారని చైతన్య చెప్పుకొచ్చారు.

    గోదావరి సినిమా నుంచి శేఖర్ వద్ద..

    గోదావరి సినిమా నుంచి శేఖర్ వద్ద..

    ‘‘2006లో వచ్చిన ‘గోదావరి' మూవీ నుంచి నేను శేఖర్ కమ్ముల వద్ద డైరెక్షన్ డిపార్టుమెంటులో, రైటింగ్ డిపార్టుమెంటులో ఉన్నాను. ఆయన ఇప్పటి వరకు 9 సినిమాలు చేశారు. ప్రతి సినిమాలోనూ దాదాపు 20 మంది ఉమెన్ డిఫరెంట్ క్రూమెంబర్స్‌గా ఉంటారు.'' అని చైతన్య తెలిపారు.

    కాస్టింగ్ చేసేది మేమే

    కాస్టింగ్ చేసేది మేమే

    సినిమాకు సంబంధించి కాస్టింగ్ మేమే చేస్తాం. అందులో ఉమెన్ తప్పకుండా ఉంటారు. మేము చేసి ఫిల్టర్ అయిన తర్వాత కో డైరెక్టర్ దగ్గరకు వెళుతుంది. కో డైరెక్టర్ కూడా ఉమెన్ ఉంటారు. మొదటి నుంచి ఆయన సినిమాలకు ఉమెన్ కో డైరెక్టర్‌ పని చేస్తున్నారు. ఫస్ట్ ఫిల్మ్ డాలర్ డ్రీమ్స్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సునీత తాటి అనే మహిళ పని చేశారని... చైతన్య తెలిపారు.

    కాస్టింగ్ కౌచ్ అనేది శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండదు

    కాస్టింగ్ కౌచ్ అనేది శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండదు

    శేఖర్‌ను ఏమైనా అంటే మమ్మల్ని అన్నట్లే. ఎందుకంటే కాస్టింగులో మేమూ భాగమే. శేఖర్ కమ్ముల సినిమాల్లో అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఉండదు. బయట ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ 20 ఏళ్ల క్రితం లేదు. 1999లో డాలర్ డ్రీమ్స్ తీసినపుడే శేఖర్ కమ్ముల మహిళలకు తన సినిమాలో సముచిత స్థానం కల్పించారని చైతన్య తెలిపారు.

    అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎలా వచ్చాయో?

    అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎలా వచ్చాయో?

    ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినపుడు చాలా హర్టయ్యాం. సినిమాల్లో కూడా ఆయన మహిళలను డిగ్రేడ్ చేసి చూపించడం చేయరు. చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు ఎలా వచ్చాయో తెలియదు. తర్వాత శ్రీరెడ్డి తాను చేసిన ఆరోపణలు తప్పు అని తర్వాత రియలైజ్ అయ్యారని చైతన్య వెల్లడించారు.

    శ్రీరెడ్డి ఇండస్ట్రీలో కొన్నిఫేస్ చేసి ఉండొచ్చు

    శ్రీరెడ్డి ఇండస్ట్రీలో కొన్నిఫేస్ చేసి ఉండొచ్చు

    ఇక్కడ నేను శ్రీరెడ్డిని ఏమీ అనడం లేదు. ఆమె ఇండస్ట్రీలో కొన్నిఫేస్ చేసి ఉండొచ్చు. ఇండస్ట్రీలోనే కాదు.. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఇప్పటి వరకు శేఖర్ గారి వద్దే పని చేశాను. ఇక్కడ అలాంటివి ఎప్పుడూ జరుగలేదని చైతన్య స్పష్టం చేశారు.

    ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది.

    ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది.

    ప్రస్తుతం శేఖర్ కమ్ముల వద్దే కాకుండా... బయట ముగ్గురు డైరెక్టర్ల దగ్గర పని చేస్తున్నాను. వాళ్లతో ఇప్పటి వరకు ఏ సమస్య రాలేదు. వారంతా యంగ్ డైరెక్టర్స్.. నాకంటే చిన్నవారు. కొత్తగా వచ్చే వారు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడం లేదు. గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయిందని చైతన్య తెలిపారు.

    English summary
    "Shekhar is not such a person. Many women are working wit him. No one has ever come into trouble." Women lyricist Chaitanya about Shekar Kammula, Sri Reddy casting couch controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X