అంతా ఆడోళ్ల రాజ్యమే... (మహానటి మేకింగ్ వీడియో)
సావిత్రి జీవితంపై తెరకెక్కించిన బయోపిక్ 'మహానటి' చిత్రం మే 9న విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా సినిమా తీశారంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఏ తెలుగు సినిమాలో లేని విధంగా ఈ చిత్రంలో ఎక్కువ మంది మహిళలు తెర వెనక పని చేశారు.
తాజాగా సినిమాలో తెర వెనక పని చేసిన మహిళలను ఫోకస్ చేస్తూ ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. చిత్ర నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ దగ్గర నుండి ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లందరినీ చూపించారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం మే 9న విడుదలై సూపర్ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు సాధిస్తోంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు, 45 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ఎలా ముగిసింది అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించారు.
స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు మోహన్ బాబు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రల్లో మెరిశారు.


Click it and Unblock the Notifications











