twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మలయాళీ సూపర్ స్టార్ పై కేసు... ఆందోళనలో మమ్ముట్టి అభిమానులు

    |

    మలయాళీ టాప్ హీరో మమ్ముట్టికి కేరళ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 'కసాబా' సినిమాలో మహిళలను కించపరిచారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మమ్ముట్టితో పాటు చిత్ర నిర్మాత, దర్శకుడికి నోటీసులు ఇచ్చింది.

    ఈ సినిమాలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ తనయ, తమిళ కథానాయిక వరలక్ష్మి లేడీ డాన్ పాత్రలో నటించింది.. ఇందులో గ్రామీణ ప్రాంతానికి చెందిన లేడీ డాన్ గా వరలక్ష్మికనిపిస్తుంది.. కేరళలో యావరేజ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఈ వివాదం తో కలెక్షన్లను పెంచుకుంటోంది.. అయితే ఈ కేసు మరీ బలం గా ఉండతం తో కేసు బలంగా ఉండటం తో సినిమా కొన్నాళ్ళు నిలపి వేయటం గానీ లేదా కొన్ని సీన్లను తొలగించటం గానీ జరగొచ్చనటం తో మమ్ముట్టి అభిమానులు కాస్త కలవర పడుతున్నారు. అసలిమంతకీ ఏం జరిగిందంటే....

    Women’s commission objects to sexist

    'కసాబా' సినిమాలో మహిళలను అగౌరపరిచేలా డైలాగులు, దృశ్యాలు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో నోటీసులు జారీ చేశామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కే రోసకుట్టి టీచర్ తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో మహళలను కించపరచడం తగదని ఆమె అన్నారు. మమ్ముట్టి లాంటి పెద్దహీరో సినిమాల్లో ఇలాంటి దిగజారుడు డైలాగులు చెప్పడం, సన్నివేశాల్లో నటించడం సరికాదన్నారు.

    మహిళలను కించపరిచే డైలాగులు, సన్నివేశాలు లేకుండా చూడాలని సెన్సార్ బోర్డు, మలయాళం నటీనటుల సంఘం, సినీ టెక్నిషియన్స్ అసోసియేషన్ కు లేఖలు రాయాలని నిర్ణయించినట్టు చెప్పారు.,,రంజాన్ సందర్భంగా విడుదలైన 'కసాబా' హిట్ టాక్ సొంతం చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీనియర్ మహిళా పోలీసు అధికారిని హెచ్చరించే సన్నివేశంలో అభ్యంతకర డైలాగులు ఉన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Mammootty-starrer Malayalam hit Kasaba has found itself at the centre of controversy with the Kerala Women's Commission objecting to its sexist dialogues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X