twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వణుకు పుట్టించింది.. కానీ!: 'జీఎస్‌టీ' చూశాక మహిళ మెసేజ్.. థ్యాంక్స్ చెప్పిన వర్మ

    |

    Recommended Video

    వణుకు పుట్టించింది.. కానీ.. 'జీఎస్‌టీ' కేకట !

    'జీఎస్‌టీ' (గాడ్,సెక్స్&ట్రూత్) చిత్రంపై ఓవైపు మహిళ సంఘాల ఆందోళనలు కొనసాగుతుంటే.. మరోవైపు కొంతమంది మహిళల నుంచి మాత్రం వర్మకు మద్దతు లభిస్తుండటం గమనార్హం. నేటి ఉదయం 9గం.కు సినిమా విడుదలవడంతో.. కొంతమంది మహిళలు కూడా ఈ చిత్రాన్ని చూసినట్లు తెలుస్తోంది. చూడటమే కాదు.. వర్మకు మద్దతునిస్తూ ఆయనకు మెసేజ్‌లు కూడా పెట్టారట. ఈ విషయాన్ని ఆర్జీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు..

    'జీఎస్‌టీ'కి పోటెత్తుతున్న ట్రాఫిక్: నేడే విడుదల, ఆ కామెంట్‌తో మరో వివాదంలో వర్మ..'జీఎస్‌టీ'కి పోటెత్తుతున్న ట్రాఫిక్: నేడే విడుదల, ఆ కామెంట్‌తో మరో వివాదంలో వర్మ..

    వణుకు పుట్టించింది.. కానీ!: వర్మకు మెసేజ్

    గాడ్ సెక్స్&ట్రూత్ చూసిన తర్వాత ఓ మహిళ ఇలా మెసేజ్ చేసిందంటూ వర్మ దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'ప్రతీ సీన్ వణుకుపుట్టించేలా ఉంది. ఇది పోర్న్ కాదు, ఫిలాసఫీ అంతకన్నా కాదు.. స్త్రీ శరీరంలోని ప్రతీ భాగాన్ని శృంగారపరమైన ఆధ్యాత్మికతతో కూడిన పవిత్ర పద్దతిలో ఆరాధించడం' అని అందులో సదరు మహిళ పేర్కొనడం గమనార్హం.

    'ఆలోచించేలా చేసింది..':

    'ఓ బాలికగా సామాజిక కట్టుబాట్లు, నైతిక విలువల వల్ల నేను అణ‌చివేత‌కు గుర‌య్యాను. కానీ జీఎస్‌టీ చూసిన త‌ర్వాత దేవుడు న‌న్ను మ‌హిళ‌గా పుట్టించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. మ‌హిళ శృంగార స్వేచ్ఛ గురించి చెప్పిన విధానం నాకు న‌చ్చింది. నా శృంగార హ‌క్కుల గురించి ఆలోచించేలా చేసింది. వ‌ర్మ‌కి, మియా మాల్కోవాకి ధ‌న్య‌వాదాలు' అని మరో మహిళ తనకు మెసేజ్ చేసినట్లు ఆర్జీవి ట్వీట్ చేశారు.

    థ్యాంక్స్ చెప్పిన వర్మ..:

    మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్&ట్రూత్'ను తెరకెక్కించడంలో ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తనను అభినందిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వర్మ తెలిపారు. ఈ సినిమా చూసిన ప్రతీ మహిళ.. తప్పకుండా దీన్ని ప్రేమిస్తుందని, అలాగే స్త్రీ అందాన్ని తాను ఎంతలా గౌరవిస్తానో అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు.

     భారీ స్పందన..:

    భారీ స్పందన..:

    వర్మ 'జీఎస్‌టీ'కి ఊహించిన దానికంటే అనూహ్య స్పందన రావడం గమనార్హం. టికెట్ రేటు రూ.150పెట్టినా సరే, సినిమా చూడటానికే చాలామంది మొగ్గుచూపారు. వర్మ అసలేం చూపించి ఉంటాడో అన్న ఆసక్తితోనే ఎక్కువ మంది 'జీఎస్‌టీ' సైట్‌ను క్లిక్ చేస్తున్నారు.

     కాసుల వర్షమే?..:

    కాసుల వర్షమే?..:

    'జీఎస్‌టీ'ని వర్మ ఎంత బడ్జెట్ లో తెరకెక్కించారో తెలియదు గానీ.. మరీ ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టి ఉండరు. ఈ లెక్కన ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే.. 'జీఎస్‌టీ'కి కలెక్షన్ల పంట పండినట్లే. ఈ చిత్రాన్ని నిర్మించిన యూఎస్ ప్రొడక్షన్ హౌజ్ కలెక్షన్ల వివరాలు బయటపెడుతుందో లేదో చూడాలి మరి!

    English summary
    Director Ramgopal Varma's latest flick 'GST' creating a new sensation in Indian digital cinema. RGV tweeted a woman response after watching GST today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X